మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్న కమెడియన్!
దానిలో మరో ట్విస్ట్ ఏంటే.. బ్లాక్ లో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 8 May 2025 6:30 PMకమెడియన్.. ఏ సినిమాలో అయినా ఆ క్యారెక్టర్ అవసరమే. మూవీలో ఎలాంటి కంటెంట్ ఉన్నా.. కామెడీ కోరుకుంటారు ఆడియన్స్. అందుకే ప్రతి సినిమాలో హీరో ఎలా కామనో.. కమెడియన్ కూడా కామనే. అదే సమయంలో ఇప్పుడు మిగతా భాషల కమెడియన్స్ కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అందులో ఒక సెలబ్రిటీ ఇప్పుడు మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్నారని ఇండస్ట్రీలో వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే నరకమే చూపిస్తున్నారు. అయితే ఆయన కమెడియనే కాదు.. నిర్మాతల కష్టాలు కూడా తెలుసు అంట. అయినా కానీ ఓ రేంజ్ లో ఇబ్బంది పెడుతున్నారని వినికిడి.
నిజానికి.. ఆయన యాక్టింగ్ కాస్త వైవిధ్యంగా ఉంటుంది. అందుకే ఆయన కోసం మేకర్స్ కాస్త పోటీ పడుతున్నారు. ఇంకేం ఉంది.. రెమ్యునరేషన్ ను భారీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సింపుల్ గా.. రోజుకు కేవలం రూ.మూడున్నల లక్షలు అడుగుతున్నారట. సినిమాలోని కాస్త లాంగ్ రోల్ అయినా కూడా పారితోషికం విషయంలో తగ్గరని టాక్..
ఎన్నో రోజులు షూటింగ్ కు వస్తే.. అన్ని మూడున్నర లక్షల రూపాయిలు ఇవ్వాల్సిందేనట. మరీ ఎక్కువ రోజుల షెడ్యూల్స్ ఉంటే.. కాస్త ఆలోచిస్తారని తెలుస్తోంది. అప్పుడు కన్సషన్ ఇస్తారట సదరు కమెడియన్. దానిలో మరో ట్విస్ట్ ఏంటే.. బ్లాక్ లో రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ మనీ ఇప్పుడు సెట్ కాదన్న నో వే.. కచ్చితంగా ఇవ్వాల్సిందే. పోనీ అదేదో సెట్ అవ్వడం తర్వాత విషయం. సెట్స్ లో వర్క్ ఇంకా అవ్వకపోయినా తాను అనుకున్న టైమ్ చూసి లేచి వెళ్లిపోవడమే. పర్టిక్యులర్ టైమ్ అయ్యాక విడిచిపెట్టాల్సిందే.లేకుంటే ఆయనే వెళ్లిపోతారు. కాల్స్ షీట్స్ విషయానికొస్తే ఇంక చెప్పనక్కర్లేదు.
ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న ప్రకారం కాకుండా మరో రోజు కాల్ షీట్ అడిగితే అస్సలు ఒప్పుకోరట. వేరే షూట్ ఉందని.. అదని.. ఇదని కొత్త కండీషన్లు పెడతారని టాక్. ఒకవేళ రావాల్సిందే అంటే.. అన్ని ఖర్చులు భరించుకోవాల్సిందే అన్న విధంగా చెబుతారట. దీంతో ఇప్పుడు ఆ కమెడియన్ కోసం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.