టాలీవుడ్ స్టార్ హీరోల లేడీ హీరోయిన్ ప్రెండ్స్!
స్టార్ హీరోలకు హీరోయిన్లలో సైతం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన స్టార్ గా భావి స్తుంటారు. కొంత మంది నటీమణులతో ఆ హీరోలు కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తుంటారు.
By: Tupaki Desk | 29 Jun 2025 12:00 AM ISTస్టార్ హీరోలకు హీరోయిన్లలో సైతం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన స్టార్ గా భావి స్తుంటారు. కొంత మంది నటీమణులతో ఆ హీరోలు కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. ఆ స్నేహం ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఒకరింటికి మరొకరు వచ్చి వెళ్లేంత బాండింగ్ వాళ్ల మద్య ఉంది. టాలీవుడ్ లో అలాంటి స్నేహితులెవరు? అంటే చాలా మందే ఉన్నారు. కింగ్ నాగార్జునకు టబు మంచి స్నేహితురాలు.
ఇద్దరు జంటగా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు మొదలైన పరిచయం మంచి స్నే హంగా మారింది. హైదరాబాద్ వచ్చినప్పుడు నాగార్జున ఇంటిలోనే ఆదిథ్యం పొందుతున్నారు. నాగార్జున ఇంటి సమీపంలో టబు కూడా సొంత ప్లాట్ కూడా ఉంది. ఇటీవలే జరిగిన అఖిల్ పెళ్లికి కూడా టబు ముంబై నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వత జనరేషన్ హీరోల్లో ఇలాంటి స్నేహాన్ని రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కొంతమంది భామలతో కొనసాగిస్తున్నారు.
చరణ్ కి రకుల్ ప్రీత్ సింగ్ మంచి ప్రెండ్. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఉపాసనతో ఎక్కువగా కనిపిస్తుంటారు. చరణ్ తో రకుల్ ఓ సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే. అలాగే స్వీటీ అనుష్క ...డార్లింగ్ ప్రభాస్ మంచి స్నేహితురాలు. ఇద్దరి స్నేహం సినిమాలతో మొదలైంది. అప్పటి నుంచి మంచి స్నేహితులయ్యారు. బెంగుళూరు నుంచి అనుష్క ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా? ప్రభాస్ ని కలవకుండా వెళ్లదు.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ మంచి స్నేహితురాలు. ఇద్దరు టామన్ -జెర్రీ టైపులో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కలిసి నటించారు. అలియాభట్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తారక్ ఇంట్లోనే అతిధ్యం పొందుతుంది. హోటల్ లో దిగుతానంటే తారక్ ఎంత మాత్రం ఇష్టపడడు. ఇంటికొచ్చిన అతిధికి చికెన్ బిర్యానీ వండి వడ్డించడం తారక్ స్పెషాల్టీ. రష్మిక- విజయ్ దేవరకొండ మధ్యా అలాంటి బాండింగ్ ఉంది. రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ ఇంట్లోనే ఉంటుంది. ఆఫ్యామిలీకి రష్మిక కుటుంబంలో మనిషిలా మారిపోయింది.
