ఒకే ఫ్రేమ్ లో తారక్, సుక్కూ, వంశీ ఫ్యామిలీస్.. స్పెషల్ ఏంటంటే?
డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే సందర్భంగా దిగిన పిక్ అది. సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియాలో రీసెంట్ గా పోస్ట్ చేశారు.
By: Tupaki Desk | 8 April 2025 3:33 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సుకుమార్ ఫ్యామిలీలు ఒకే చోట కనిపించాయి. వారితోపాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకర్షించి నెట్టింట అలరిస్తుందనే చెప్పాలి.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే సందర్భంగా దిగిన పిక్ అది. సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియాలో రీసెంట్ గా పోస్ట్ చేశారు. ఆనందం, నవ్వు, ప్రేమతో నిండిన రోజు.. అన్నీ మాలిని ప్రత్యేక దినోత్సవ వేడుకల్లోనే! మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం ఇంకా చాలా ఉన్నాయంటూ తబిత ఇన్ స్టాలో ట్వీట్ చేశారు.
అయితే తబిత పోస్ట్.. పెట్టిన కొన్ని క్షణాలకే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా తారక్, ఆయన సతీమణి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. పిక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫ్రెండ్ షిప్ గోల్స్ అంటూ క్రేజీ ట్యాగ్ ఇస్తున్నారు. తారక్ ఎక్కడుంటే అక్కడ ఫుల్ సందడి అని చెబుతున్నారు.
రీసెంట్ గా తారక్.. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్ తో రిలాక్స్ అవుతున్న పిక్ బయటకు వచ్చింది. ఇప్పుడు మాలిని బర్త్ డే లో పాల్గొన్న ఫోటో ఆకట్టుకుంటోంది. మొత్తానికి అలా తారక్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే వార్ -2 షూటింగ్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో మూవీకి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా.. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్.
మరోవైపు, సుకుమార్ ఇప్పుడు రిలాక్స్ డ్ మోడ్ లో ఉన్నారు. రీసెంట్ గా పుష్ప-2తో మంచి హిట్ అందుకోగా, ఇప్పుడు చరణ్ తో మూవీ, పుష్ప-3 పనులు స్టార్ట్ చేయనున్నారు. ఇక వంశీ పైడిపల్లి ఇంకా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు స్టోరీ చెప్పారని వార్తలు వస్తున్నాయి. కానీ ఎలాంటి ప్రకటన కూడా ఇప్పటి వరకు రాలేదు.
