కంటెంట్ సినిమాలు.. బాక్సాఫీస్ ఫేట్ మారుస్తాయా?
సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ మోత మోగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం స్లంప్ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ డల్ అవడం కొత్తేమీ కాదు.
By: Garuda Media | 6 March 2026 12:10 AM ISTసంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ మోత మోగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం స్లంప్ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ డల్ అవడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. పండుగ తర్వాత ఆరు వారాల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఏవీ నిలబడలేకపోయాయి. ఆక్యుపెన్సీలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. గత వారం వచ్చిన శ్రీ విష్ణు మూవీ ‘విష్ణు విన్యాసం’ కూడా ప్రేక్షకులను పెద్దగా థియేటర్లకు రప్పించలేకపోయింది.
ఐతే ఈ వారం కొన్ని ప్రామిసింగ్ మూవీస్ థియేటర్లలోకి దిగుతున్నాయి. ఇప్పుడైనా పరిస్థితి మారుతుందేమో అని ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత వారం ‘విష్ణు విన్యాసం’ లాంటి కామెడీ మూవీతో పలకరించిన శ్రీ విష్ణు.. ఈ వీక్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ రూపొందించిన మూవీ. దీని ప్రోమోలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఒక రేసీ థ్రిల్లర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. సుకుమార్, నాని సహా చాలామంది ప్రముఖులు ఈ సినిమా చూసి.. దీన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. ఇండస్ట్రీలో ఈ మూవీపై మంచి బజ్ ఉంది.
ఇక ముందు ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుని, కంటెంట్ మీద నమ్మకంతో ఆ ఆలోచనను విరమించుకుని థియేటర్లలో విడుదల చేస్తున్న సినిమా.. ‘సంప్రదాయినీ సుప్పినీ శుద్ధపూసనీ’. శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ రూపొందించిన ఈ చిత్రం.. ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తేలా కనిపిస్తోంది. మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎస్.సరస్వతి’ కూడా ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. అది సెంటిమెంట్ మిక్స్ చేసిన థ్రిల్లర్ మూవీ. దీంతో పాటు ‘హిట్’ ఫేమ్ శ్రీనాథ్ మాగంటి లీడ్ రోల్ చేసిన ‘మాన్షన్ హౌస్ మల్లేష్’ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది. మొత్తంగా ఈ వీకెండ్ మూవీస్ ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. మరి ఇవి అయిన టాలీవుడ్ బాక్సాఫీస్‌ను స్లంప్ నుంచి బయటికి తీసుకొస్తాయేమో చూడాలి.
