2025లో తెలుగు సినిమాలు కలెక్ట్ చేసింది ఎంత?
అయితే గత కొన్నేళ్ల డాటాతో పోలిస్తే సినిమాల రిలీజ్‌లు కొంత మేర తగ్గినా బాలీవుడ్‌తో బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టి పోటీని ఇస్తున్నాం.
By: Ravindar Gorantla | 21 April 2026 11:04 AM ISTపాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్‌తో దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే అపోహని తొలగించి దేశ వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్‌గా సత్తా చాటుకుంటోంది. మార్కెట్ వాటా పరంగానూ మనం ముందు వరుసలోనే ఉండటం గమనార్హం. వసూళ్ల పరంగా బాలీవుడ్‌తో పోటీపడుతోంది. బాలీవుడ్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, రెండవ స్థానాన్ని టాలీవుడ్ దక్కించుకోవడం గమనార్హం.
ఇంత పోటీనిస్తున్నా మన సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నానాటీకీ తగ్గిపోతోంది. అయినా సరే రెవెన్యూ మాత్రం పడిపోకపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గత ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా విడుదలైన సినిమాలు ఎన్ని..అందులో మన సినిమాలు ఎన్నిఅన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2025లో దేశ వ్యాప్తంగా 1900 సినిమాలు విడుదలయ్యాయి. అందులో మన వాటా 282.
అయితే గత కొన్నేళ్ల డాటాతో పోలిస్తే సినిమాల రిలీజ్‌లు కొంత మేర తగ్గినా బాలీవుడ్‌తో బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టి పోటీని ఇస్తున్నాం. 2025లో విడుదలైన పెద్ద సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు..చిన్న సినిమాలతో కలిపి రూ.2300 కోట్లకు పైనే వసూళ్లని రాబట్టాయి. గత ఏడాదితో పోలిస్తే కొంత మేర వసూళ్లు పెరిగినా ప్రేక్షకుల ఆదరణ శాతం మాత్రం చాలా వరకు తగ్డం గమనార్హం. అయితే గతంతో పోలిస్తే టికెట్ ధరలు భారీగా పెరగడంతో ఆ లోటు ఎక్కడా వసూళ్లలో కనిపించలేదు.
బాధపడాల్సిన విషయం ఏంటంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రేక్షకుల ఆదరణ శాతం పెరగాల్సింది పోయి తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయం. పరిశ్రమ టోటల్ టర్నోవర్ లెక్కలు పెద్దగా తగ్గకపోయినా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ లో అగ్రశ్రేణి చిత్రాలదే ప్రధాన ఆదిపత్యం. కానీ గడిచిన కొన్ని నెలలుగా ఇందులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మీడియం రేంజ్ సినిమాలు కూడా భారీ వసూళ్లని రాబడుతూ మార్కెట్‌లో తమ వాటాని గణణీయంగా పెంచుకోవడం శుభ పరిణామం.
ఓటీటీల ద్వారా కూడా ఆదాయం వస్తుండటంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పే పర్ వ్యూ పద్దతి ద్వారా కూడా ఈ మధ్య కొన్ని సినిమాలు పది కోట్లకు మించి వసూళ్లని రాబడుతున్నాయి. ఈ మధ్య ఓటీటీల్లో విడుదలైన పలు సినిమాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. దీంతో ఓటీటీ మార్కెట్‌లో తెలుగు సినిమాకు, చిన్న తనహా, మీడియం రేంజ్ సినిమాలకు ప్నోత్సాహం లభిస్తుండటంతో తీవ్రమైన పోటీని, సవాళ్లని తట్టుకుంటూ నిలబడుతున్నాయి. ఇక గత కొంత కాలంగా కంటెంట్ ప్రధాన చిత్రాలకే అంతా ప్రాధాన్యం ఇస్తుండటంతో టాలీవుడ్ మార్కెట్‌లో గణణీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో నూతనంగా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకుంటున్న వారికి అవకాశాలు పెరుడుతుండటం గమనార్హం.
