సినీ గ్లామర్ వెనుక మరో కథ!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొన్ని అనధికార లెక్కలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కలెక్షన్‌ల దగ్గరి నుంచి సినిమా లాభాల వరకు ప్రతీదీ ఓ ఫేక్ ప్రచారం సాగుతుంటుంది.
By: Tupaki Desk | 20 Dec 2025 11:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొన్ని అనధికార లెక్కలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కలెక్షన్‌ల దగ్గరి నుంచి సినిమా లాభాల వరకు ప్రతీదీ ఓ ఫేక్ ప్రచారం సాగుతుంటుంది. రియాలిటీ వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరుగా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా ఫ్లాప్ అయినా సరే మేకర్స్ ఆడియన్స్‌కు చూపించే లెక్కలు వేరుగా ఉండటం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
అసలు లెక్కలు పాతాళంలో ఉంటే మేకర్స్ చూపించే లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సత్యం. కానీ ఎవరూ ఏమీ అనరు. అసలు లెక్కలు చెప్పరు. అంకెల గారడీతో ఫ్లాప్ అయిన సినిమా కూడా కోట్లల్లో లాభాల్ని ఆర్జించిందని స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం, ఇన్ని రికార్డుల్ని తిరగరాసిందని గొప్పలు చెప్పడం టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిపాటిగా మారింది. ఇదంతా మేకర్స్ చేస్తున్న మాయ అని, అంకెల గారడీ అని స్పష్టమవుతున్నా సరే ఎవరూ తగ్గరు ఒకటికి రెండు చేర్చి చెబుతారే కానీ వాస్తవ లెక్కలు ఎక్కడా చెప్పరు.
కారణం స్టార్స్ కావచ్చు.. మరేదైనా కారణం కావచ్చు. ఒక వేళ హిట్ అయినా సరే కొన్ని సినిమాలకు నష్టాలే వచ్చాయని ఫేక్ బిల్లులు, కాపీ రైట్ డ్రామాలు, డిప్రిసియేషన్స్ ట్రిక్స్‌ని ప్రదర్శించడం అలవాటుగా మారింది. ఇక కొన్ని సినిమాలకైతే భారీ నష్టాలు ఎదురైనా సరే మా ప్రాజెక్ట్ ప్రాఫిట్‌ని అందించిందని జబ్బలు చరుకుని మరీ చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలింగించక మానదు. గ్లామర్ ప్రపంచంలో జరిగే ఈ ఆర్థక మాయలని చూసి సగటు ప్రేక్షకుడు బుర్ర బద్దలు కొట్టుకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి.
ఇంతకీ మేకర్స్ చెప్పేది నిజమా? అబద్ధమా? అనేది ఎవరికీ అంతు చిక్కదు. ఒక సినిమా లాభాలు గడించిందంటే లేదు నష్టాలు అంటారు.. నష్టాలని తెచ్చి పెట్టింది అంటే లేదు లేదు లాభాలు కురిపించిందని గొప్పలకు పోతారు. తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా కారణంగా ఎల్లలు దాటినా మేకర్స్‌లో ఈ లెక్కల మాయ విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చాలా మంది విమర్శలు, ట్రేడ్ వర్గాలు గ్లామర్ మాటున దాగిన ఆర్థిక మాయాజాలంపై ఇప్పటికైనా సరైన చర్చ జరగాలని, అప్పుడే నిజాలు నిగ్గుతేలు తాయని అంటున్నారు. మరి టాలీవుడ్ మేకర్స్ ఇప్పటికైనా గ్లామర్ మాయ వెనుక జరుగుతున్న ఆర్థక మాయలపై క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెడుతారో వేచి చూడాల్సిందే.
