నమ్మకం శృతి మించితే ఇలాగే!
పాత రోజుల్లో హీరోలను చూసి జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు. ఆ తర్వాత కాంబినేషన్లు నమ్మడం మొదలైంది.
By: Tupaki Desk | 13 April 2025 5:00 PM ISTపాత రోజుల్లో హీరోలను చూసి జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు. ఆ తర్వాత కాంబినేషన్లు నమ్మడం మొదలైంది. చాలా కాలం ఈ కాంబినేషన్లు బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. హీరోల్ని చూసి జనాలు థియేటర్లకు రావడం మానేసారు. కాంబినేషన్లు నమ్మి అసలే రావడం లేదు. హిట్...ప్లాపులు అన్నింటిని బేరీజు వేసుకుని ఆడియన్ టికెట్ కొంటున్నాడు. అలా కంటెంట్ కి ప్రాధాన్యత పెరిగి కటౌట్ కి ప్రాధాన్యత తగ్గింది.
ఈ విషయాన్ని గమనించే సీనియర్ హీరోలు ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో మాత్రమే పనిచేయడానికి ముందు కొస్తున్నారు. గత విజయాలు చూసి అవకాశాలివ్వడం లేదు. ఫాంలో ఎవరున్నారు? అతడు తీయగలడా? లేదా? అనే నమ్మకం పక్కాగా కుదిరిన తర్వాత అవకాశం ఇస్తున్నారు. ఇందులో ఎక్కువగా యువ ప్రతి భావంతులే కనిపిస్తున్నారు. అలా సీనియర్ హీరోలు సీనియర్ డైరెక్టర్లకు చెక్ పెట్టారు.
టాలీవుడ్ సక్సెస్ లో ఉందంటే? కారణాల్లో ఇదొక ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంత మంది యంగ్ హీరోలు ఈ మధ్య ఈ విషయాన్ని పెడ చెవిన పెట్టి సినిమాలు చేస్తున్నారు. రెండు.. .మూడు విజయాలు దక్కేసరికి స్టార్ డమ్ బిల్డ్ అయ్యే సరికి తమని మాత్రమే చూడటానికే జనాలు థియేటర్ వస్తున్నారని అనుకుంటున్నారు. కానీ అదంతా భ్రమా అని ఒకటి రెండు..పరాజయాలు పడే సరికి సంగతి అంతే వేగంగా అర్దమవుతుంది.
అలాంటి యంగ్ హీరోలు ఓ ముగ్గురు..నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కథాబలం ఉన్న చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ డమ్ కూడా మెరుగు పడింది. దీంతో తర్వాత సినిమాల్లో అంతే విషయం ఉంటుందని జనాలు నమ్మి థియేటర్ కి వెళ్తే చుక్కలు చూపించారు. ఓ పెద్ద జెండు భామ్ సినిమా తీసాడురా? అనే విమర్శల స్థాయికి పడిపోయారు. ఈ మధ్యనే అలాంటి ఓ సినిమా రిలీజ్ అయింది.
తన ఓల్డ్ ఫార్మెట్ లో సినిమా తీసాడు. ప్రతీ ప్రేమ్ లో ఆహీరో కనిపించాడు? తప్ప కథలో బలం ఎక్కడా కనిపించలేదు. అంతకు ముందు మరో యంగ్ హీరోలిద్దరు కూడా ఇదే పార్మెట్ లో సినిమాలు తీసి రిలీజ్ చేసారు. ఆ చిత్రాలపైనా అలాంటి విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. అప్పుడే? సరైన కథల ఎంపికకు ఆస్కారం ఉంటుంది. లేదంటే కట్టుకున్న గూడు పేక మేడలా అంతే వేగంగా కూలిపోతుంది అన్నది నమ్మాల్సిన వాస్తవం.
