ఏరు దాటాక తెప్ప తగలేసిన నటి
ఇప్పుడు మరో నటి కూడా టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి ఇక్కడ కెరీర్ ముగిశాక, బాలీవుడ్ కి వెళ్లిపోయింది. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు దక్కలేదు.
By: Tupaki Desk | 1 Jun 2025 5:00 AM ISTఈ మధ్య ఏరు దాటాక తెప్ప తగలేసే నటీమణులు పరిచయం అవుతున్నారు. ఢిల్లీకి చెందిన పాపులర్ కథనాయిక సౌత్ లో చాలా కాలం పెద్ద అవకాశాల కోసం ప్రయత్నించి చివరికి పెద్ద స్టార్ అవ్వలేక విసిగిపోయి, హిందీ పరిశ్రమకు వెళ్లిపోయింది. అక్కడ కొంత స్థిరపడ్డాక, తనకు మొదటి అవకాశం కల్పించిన టాలీవుడ్ ని, టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ, షాకిచ్చింది. తన బొడ్డుపై పండ్లు, పూలు వేసాడంటూ ఆరోపించింది. ఈ నటి ఎవరో అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు మరో నటి కూడా టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి ఇక్కడ కెరీర్ ముగిశాక, బాలీవుడ్ కి వెళ్లిపోయింది. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు దక్కలేదు. కెరీర్ పరంగా చాలా ఆపసోపాలు పడి, చివరికి ఒక రెండు వెబ్ సిరీస్ లలో బోల్డ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుని, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడుతోంది. అంతేకాదు.. ఇన్నేళ్ల తర్వాత తనను ఒక సౌత్ దర్శకుడు కమిట్ మెంట్ అడిగాడని మీడియా ముందు గుర్తు చేసుకుంది. అలాగే ఒక దర్శకుడు బుగ్గపై ముద్దాడాడు అని కూడా చెప్పింది. అలాగే దర్శకుల పేర్లు బయటకు చెప్పనని చెబుతోంది. అయితే ఈ ప్రకటనలన్నీ కేవలం తనపై మీడియా అటెన్షన్ పెరిగేందుకేనా? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వీటిని గుర్తు చేస్తోంది? ఎందుకు ఈ కట్టుకథలు? అంటూ చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదో ఒక సంచలన ప్రకటన చేయడం ద్వారా ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోగలరేమో కానీ, అవి పెద్ద స్టార్ల సరసన అవకాశాలు తేగలవా? తనను తాను నటిగా ప్రెజెంట్ చేసుకోవడంలో, లేదా వైవిధ్యమైన నటిగా గుర్తింపు తెచ్చుకోవడం ద్వారానో అవకాశాలొస్తాయి కానీ, ఇలాంటి వివాదాల్ని, త్రోబ్యాక్ సంగతుల్ని మీడియా ముందు మాట్లాడితే అగ్ర హీరోయిన్ గా ఎదగడం సాధ్యపడదని కూడా సూచిస్తున్నారు. కనీసం ఇప్పటికి అయినా అసలు విషయం అర్థం చేసుకుంటుందేమో చూడాలి. స్టార్ హీరోయిన్ అవ్వాలని కలల కంటే సరిపోదు.. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలని ఎప్పటికి తెలుసుకుంటుందో?
