వైష్ణవి చైతన్య న్యూ ట్రెండ్.. స్లిమ్ అండ్ స్టైలిష్!
యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు వైష్ణవి చైతన్య తనదైన గుర్తింపు సంపాదించుకుంది.
By: Tupaki Desk | 26 April 2025 4:00 PM ISTయూట్యూబ్ వెబ్ సిరీస్‌ల నుంచి సినీ ఇండస్ట్రీ వరకు వైష్ణవి చైతన్య తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తొలి దశలో చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ, "బేబి" సినిమా సక్సెస్‌తో యువతలో క్రేజ్ ను సంపాదించుకుంది. చిన్న వయసులోనే మంచి నటనతో పాటు స్టైలిష్ ప్రెజెన్స్ చూపిస్తూ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.
ఇటీవల వైష్ణవి తన కొత్త ఫోటోషూట్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. బ్రౌన్ కలర్ ఫిట్‌డ్ గౌన్ ధరించిన ఆమె లుక్ ఫ్యాన్స్ ను కట్టిపడేసింది. సింపుల్ అయినా కూడా క్లాస్ టచ్ ఉన్న ఈ డ్రెస్‌తో వైష్ణవి అందాన్ని మరింత హైలైట్ చేసింది. పొడవైన జుట్టుతో స్టైలిష్ హేయర్ డిజైన్, మేకప్ లుక్ ఈ ఫోటోలకు స్పెషల్ టచ్ ఇచ్చాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోల్లో వైష్ణవి క్యాజువల్ పోస్టులే కాకుండా తనలో ఉన్న కాన్ఫిడెన్స్ ను కూడా చూపించింది. సాధారణమైన స్టూడియో బ్యాక్‌డ్రాప్ లో షూట్ చేసినా, లైట్ మరియు షేడో ప్లే వలన ఫోటోలకు కొత్త లుక్ వచ్చింది. ఆమె పోజింగ్ స్టైల్ చూసి ఫ్యాన్స్ "నెక్ట్స్ లెవెల్ స్టార్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైష్ణవి కెరీర్ పరంగా కూడా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఆమె కెరీర్ లో "బేబి" తర్వాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గ్లామర్ మిక్స్ చేసిన క్యారెక్టర్‌లకు కూడా సిద్ధమవుతూ, ఓల్డ్ స్కూల్ నుండి మోడర్న్ స్టైల్ లోకి మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ తాజా ఫోటోషూట్ చూస్తే, వైష్ణవి నటన మాత్రమే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన స్టైల్ సెట్ చేసుకుంటోంది అనిపిస్తోంది.
