Begin typing your search above and press return to search.

50 వ‌య‌సులో ద‌డ పుట్టిస్తున్న సుష్‌!

1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుష్మితా సేన్ ఆ త‌ర్వాత న‌ట‌న‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 May 2025 8:04 PM IST
Tollywood Actress Sushmita Sen
X

1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న సుష్మితా సేన్ ఆ త‌ర్వాత న‌ట‌న‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కింగ్ నాగార్జున స‌ర‌స‌న ర‌క్ష‌కుడు (1996) చిత్రంలోక‌థానాయిక‌గా న‌టించింది. అదే ఏడాదిలో `దస్తక్‌`తో హిందీ సినిమాల్లోకి ప్రవేశించింది. బివి నంబర్ 1, ఫిల్హాల్, మై హూ నా వంటి చిత్రాలలో తన బలమైన పాత్ర‌ల‌తో మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాణిగా కిరీటం అందుకున్న సిస్మితాసేన్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు.


అయితే సుస్మితాసేన్ ప్ర‌తిసారీ ఎఫైర్ మ్యాట‌ర్స్ తో మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. ప్రేమాయ‌ణాలు, బ్రేక‌ప్ లు సుష్ కి కొత్తేమీ కాదు. లైఫ్ లో పెళ్లి మ్యాట‌ర్ ఎత్త‌కుండా డేటింగుల‌తో టైమ్ స్పెండ్ చేసిన సుస్మితాసేన్ చివ‌రిగా మోడ‌ల్ రోహ్మ‌న్ షాల్ తో డేటింగ్ చేసింది. ఆ త‌ర్వాత బిజినెస్ మేన్, ఐపీఎల్ ఫౌండ‌ర్ ల‌లిత్ మోడీతో డేటింగులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించినా కానీ, ఇంత‌లోనే అది బ్రేక‌ప్ అయింది. ఇటీవ‌ల జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న OTT సిరీస్ ఆర్యతో సుష్ న‌టిగా తిరిగి వ‌చ్చింది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రమాదకరమైన నేరాల ప్రపంచాన్ని ఢీకొట్టే తల్లిగా త‌న‌ పాత్ర విమర్శకుల ప్రశంసలను పొందింది. ఆర్యతో న‌ట‌న‌లోకి రీఎంట్రీ అద‌ర‌గొట్టేయ‌డ‌మే కాకుండా ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఎమ్మీ అవార్డులలో నామినేషన్‌ సహా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందింది.


సుస్మితాసేన్ ఎప్ప‌టికీ స్టైల్ ఐకాన్‌గా అభిమానుల హృద‌యాల్లో నిలిచి ఉంది. ఏదైనా రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా, ప‌బ్లిక్ ఈవెంట్ అయినా సుస్మితాసేన్ లుక్ గురించి చ‌ర్చ సాగుతుంది. తాజాగా సుస్మిత బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ డిజైన‌ర్ లుక్ యువ‌త‌రం గుండెల్లో గుబులు రేపింది. అయితే సుస్మితాసేన్ వ‌య‌సు 50. ఈ వ‌య‌సులోను 20 మైన‌స్ అమ్మాయిలా క‌నిపిస్తూ సుష్‌ గుబులు పెంచుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్లాక్ శారీ లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.