నవ్వడం మర్చిపోవద్దు.. శోభిత అందమైన ప్రపంచం
తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి శోభిత ధూలిపాళ్ల తన జీవిత ప్రయాణాన్ని అద్భుతమైన ఫోటో లెన్స్‌లో చూపిస్తూ ముందుకు సాగుతోంది.
By: Tupaki Desk | 28 April 2025 11:07 AM ISTతెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి శోభిత ధూలిపాళ్ల తన జీవిత ప్రయాణాన్ని అద్భుతమైన ఫోటో లెన్స్‌లో చూపిస్తూ ముందుకు సాగుతోంది. తన నటనతోనే కాదు, తన ఆలోచనా ధోరణితోనూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ, సోషల్ మీడియాలో వినూత్నమైన పోస్ట్‌లతో తన ప్రత్యేకతను చాటుతోంది.
ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు చాలా లోతైన భావాలను అందిస్తున్నాయి. గ్రాస్ పచ్చగా ఉంటుందంటే, దానికి నీళ్లు పోయించాలి అనే సందేశాన్ని ఒక ఫొటోతో చెప్పారు. ఈ ఫోటోల్లో ఓ చోట మురిపెం లాంటి చిరునవ్వును గుర్తు చేస్తూ "నవ్వడం మర్చిపోవద్దు" అని రాసిన చిన్న నోట్ కనిపిస్తుంది. మరోచోట మహాకాళేశ్వరుడి విగ్రహాన్ని చూపిస్తూ ఆధ్యాత్మికతకూ తన అనుబంధాన్ని తెలియజేశారు.
గ్రాస్ మీద తలవాల్చి పడుకున్న ఫోటోలో శోభిత నిస్సహాయతను కాదు, ఒక ప్రశాంతతను, ఒంటరితనంలోనూ ఆనందాన్ని ప్రతిబింబించారు. అదే సమయంలో ఒక పుస్తకంలోని లోతైన వాక్యాలను పంచుకుంటూ, జీవితం మీద తనదైన ఆలోచనలను వ్యక్తం చేశారు. అలాగే నాగచైతన్యతో చిల్ అవుతున్న ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసి తన లైఫ్ లో ప్రేమ ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పేసింది.
ఈ ఫోటోలు చూస్తే, ఆమె ఎంతగా తనలోని భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా, బీమా జువెల్స్ బ్రాండ్ అడ్వర్ట్ పోస్టర్‌లో ఆమె అందం, గ్రేస్ మరోసారి మెరిసిపోయాయి. ఒకవైపు పాశ్చాత్య ఫీలింగ్, మరోవైపు భారతీయ సాంప్రదాయం.. రెండింటినీ సమపాళ్లలో చూపించగలగడం శోభిత ప్రత్యేకత. ఒక్కో ఫ్రేమ్‌లో జీవితాన్ని ఎలా ప్రేమించాలో, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని ఎలా వెతుక్కోవాలో నేర్పుతోంది.
