Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : బాత్‌ సూట్‌లో మెగా హీరోయిన్‌

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్‌' సినిమాలో ముఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌.

By:  Tupaki Desk   |   14 April 2025 6:00 PM IST
Tollywood Actress Samyuktha Menon
X

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్‌' సినిమాలో ముఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2023లో ఈమె నటించిన సర్‌, బూమరాంగ్‌, విరూపాక్ష, డెవిల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో విరూపాక్ష సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా నిలిచింది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ఈమె చేసిన డెవిల్ సినిమా నిరాశ మిగిల్చింది.


గత ఏడాది పలు ఆఫర్లు వచ్చినప్పటికీ పెద్దగా సంయుక్త సినిమాలకు ఆసక్తి చూపించలేదు. వ్యక్తిగత కారణాలు చెప్పి కొన్ని సినిమాలను తిరస్కరించిందట. గత ఏడాదిలో ఈమె నటించిన లవ్‌ మీ సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ ఈమె మెయిన్‌ లీడ్‌గా నటించలేదు. విరూపాక్ష వంటి భారీ విజయం తర్వాత సాధారణంగా హీరోయిన్స్ వరుస సినిమాలు చేయాలి.. కానీ సంయుక్త మీనన్ మాత్రం సినిమాలను ఎక్కువగా ఎంపిక చేయలేదు. కానీ ఈ ఏడాదిలో ఈమె నటిస్తున్న సినిమాలు చాలానే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈమె రెండు మూడు పెద్ద సినిమాలతో రాబోతున్న నేపథ్యంలో అభిమానులు, మీడియా సర్కిల్స్ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 32 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సంయుక్త మీనన్‌ ఎప్పటిలాగే తాజాగా తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. అందాల ఆరబోత ఫోటోలతో కవ్విస్తున్న సంయుక్త మీనన్ ఈసారి బాత్‌ సూట్‌ లో కనిపించింది. సాధారణంగా స్నానంకి ముందు లేదా స్నానం తర్వాత ధరించే ఒక విభిన్నమైన డ్రెస్‌ను బాత్‌ సూట్ అంటారు. ఆ ఔట్ ఫిట్‌లో సంయుక్త మీనన్ ఫోటో షూట్‌కి ఫోజ్ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇదేంటి ఇలాంటి ఔట్‌ ఫిట్‌లో ఫోటో షూట్‌ అవసరమా అంటూ విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

1995లో కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించిన సంయుక్త మీనన్‌ చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్‌ పట్టాను పొందింది. మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో నటన రంగంలో అడుగు పెట్టిన సంయుక్త 2018లో రెండు మలయాళ సినిమాల్లో నటించింది. కెరీర్‌ ఆరంభంలోనే ఒక సినిమాలో గర్భిణి పాత్రలో నటించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు, పలు గుర్తుండి పోయే పాత్రలను చేయడం ద్వారా సంయుక్త మీనన్ పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.