పిక్‌టాక్ : రష్మిక మందన్న కొత్త ప్రేమ
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా రేంజ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
By: Tupaki Desk | 21 April 2025 10:26 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా రేంజ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. బ్యాక్ టు బ్యాక్ యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో సూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న రష్మిక ఇటీవల వచ్చిన సికిందర్ సినిమాతో నిరాశ పరచింది. సల్మాన్ ఖాన్ నటించిన ఆ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు లేవంటూ కొందరు కామెంట్ చేస్తే, ఆ సినిమా ఫ్లాప్ రష్మిక మందన్న కెరీర్ పై ఏమాత్రం ఎఫెక్ట్ చేయదని కొందరు అంటున్నారు. మొత్తానికి రష్మిక మందన్న జోరుకు సికిందర్ బ్రేక్‌లు వేసిందనే వార్తలను ఆమె ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో మరోసారి రష్మిక తన సత్తా చాటడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్‌గా రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం స్కిన్ షో ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం క్యూట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక మందన్న చేతిలో పూలు పట్టుకుని, తలపై పూలు పెట్టుకుని భలే ముద్దుగా ఉన్నారు అనే విధంగా ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగా సెలబ్రెటీలు తలలో పూలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించరు. ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో పూలు పెట్టుకుంటారేమో తప్ప ప్రత్యేకంగా హాజరు అయిన కార్యక్రమాలకు పూలు పెట్టుకుని కనిపించడం, ఫోటో షూట్స్ కోసం పూలు పెట్టుకోవడం జరగదు.
రష్మిక మందన్న తాజాగా పూల గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. మీరు చివరి సారి ఎప్పుడు పూలను కొనుగోలు చేశారు, నిన్ను నువ్వు తరచుగా అభినందించుకోవడానికి మరియు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం పూలు.. ఎందుకంటే ప్రపంచంలోని ప్రేమ మరియు దయ అంతా పూలకు అర్హం అంటూ పూలపై తన ప్రేమను కనబర్చింది. రష్మిక కొత్తగా పూలపై తన ప్రేమను కనబర్చడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే, స్వచ్చమైన ఆడవారికి పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా పూలను ఇష్టపడుతారు అంటారు. రష్మిక కి సైతం పూలపై ప్రత్యేక ప్రేమ ఉందని దీంతో అర్థం చేసుకోవచ్చు.
సికిందర్ సినిమా తర్వాత ఈ అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్మిక ఓకే చెప్పాలే కానీ ఏడాదిలో నాలుగు అయిదు సినిమాలు ఆమె నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రష్మిక మాత్రం చాలా కండీషన్స్ పెడుతూ సినిమాలకు కమిట్ అవుతుంది. కనుక కాస్త తక్కువ సినిమాలు వచ్చినప్పటికీ క్వాలిటీ సినిమాలు వస్తున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈమె హిందీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. మరో వైపు యానిమల్ పార్క్‌లోనూ ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి.