Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఓజీ బ్యూటీ నెవ్వర్ బిఫోర్‌ షో

నాని హీరోగా నటించిన 'నాని గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌.

By:  Tupaki Desk   |   19 April 2025 4:26 PM IST
Tollywood Actress Priyanka Mohan
X

నాని హీరోగా నటించిన 'నాని గ్యాంగ్‌ లీడర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది. మొదటి సినిమాలో సీరియస్‌ పాత్ర అయినప్పటికీ నటించి మెప్పించింది. పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే అందరికీ గుర్తుండి పోయే విధంగా నటించి మెప్పించింది. నాని గ్యాంగ్‌ లీడర్‌తో వచ్చిన గుర్తింపు, స్టార్‌డంతో తెలుగులో చాలా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ అమ్మడు చాలా తక్కువ సినిమాలకు కమిట్‌ అయింది. కథ నచ్చితేనే, పాత్ర బాగుంటేనే సినిమాను చేసేందుకు ఓకే చెప్పడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.


శర్వానంద్‌తో ఈమె చేసిన శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. కానీ ఆ తర్వాత చేసిన సరిపోదా శనివారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఓజీ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ తో నటించిన ఆ సినిమా కోసం ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆ సినిమా విడుదల తర్వాత కచ్చితంగా టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.1 మిలియన్‌ల ఫాలోవర్స్ కలిగి ఉన్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.


ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఫోటోలు చాలా సింపుల్‌గా స్కిన్‌ షో లేకుండా, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉంటాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లు ఉన్నాయి. పొట్టి నిక్కర్‌ను ధరించి ఉన్న ప్రియాంక అరుల్ మోహన్‌ ఫోటోలు చూసి చాలా మంది షాక్‌ అవుతున్నారు. ప్రియాంక నుంచి ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ చూడలేదు. ఇంత అందంగా ఉండే ప్రియాంక ఎందుకు రెగ్యులర్‌గా రొటీన్‌ ఔట్‌ ఫిట్‌లో కనిపిస్తూ ఉంటుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇకపై అయినా ఇలాంటి గ్లామర్‌ ఔట్‌ ఫిట్‌లో కనిపించాలని అభిమానులు, నెటిజన్స్‌ ఫోటోలకు కామెంట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


1994లో జన్మించిన ప్రియాంక అరుల్‌ మోహన్‌ కన్నడ చిత్రం ఓంధ్‌ కథే హెల్లాతో 2019లో నటన రంగంలో అడుగు పెట్టింది. తమిళంలో ఈమె నటించిన డాక్టర్‌, డాన్‌ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. బెంగళూరులోని పిఇఎస్‌ యూనివర్శిటీలో బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ చదవివింది. చదువు పూర్తి కాకముందే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో హీరోయిన్‌గా నటించేందుకు ఓకే చెప్పింది. రాబోయే రోజుల్లో సౌత్‌లో టాప్ స్టార్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడు పేరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగు స్టార్‌ హీరోల్లో మరింత మంది ఈమెతో వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఈమె ఒక పెద్ద తెలుగు సినిమాకు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయట. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చే అకవాశం లేదు. ప్రియాంక ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేస్తే బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.