Begin typing your search above and press return to search.

బికినీలో కంటే చీరలోనే అందంగా ఉన్నావ్..

సోషల మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి సెలెబ్రిటీ తన ఫొటోలతో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటారు.

By:  Tupaki Desk   |   19 May 2025 11:20 AM IST
Tollywood Actress Pooja Hegde
X

సోషల మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి సెలెబ్రిటీ తన ఫొటోలతో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటారు. అలాంటి వారిలో టాప్ లిస్ట్‌లో నిలిచే పేరు పూజా హెగ్డే. ఎప్పుడూ గ్లామర్ గౌన్లు, ట్రెండీ డ్రెస్సులతో అభిమానులని మెస్మరైజ్ చేసే పూజా.. ఇప్పుడు చీరకట్టులో ఎంతో డిఫరెంట్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఫొటోషూట్ లో ఆమె నీలం రంగు చీరను ధరించి పక్కకు కూర్చొని పుస్తకం చదువుతూ కనిపించింది. ఈ వింటేజ్ క్లాసిక్ స్టైల్‌లో పూజా మోడ్రన్ లుక్‌కు పూర్తిగా భిన్నంగా కనిపించింది. చీరలో ఆమె గ్లో, ఆమె చూపులో ఆ డెప్త్.. అన్నీ కలిపి వింటేజ్ ఫిల్మ్ స్టిల్‌లా చూపిస్తున్నాయి. ఆమె హెయిర్ స్టైల్, జ్వెలరీ కూడా సంప్రదాయాన్ని చూపిస్తూ, అద్భుతంగా కలిపాయి.


పూజా హెగ్డే కెరీర్ గురించి చెప్పాలంటే.. మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టి తమిళ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ వంటి సినిమాల్లో కనిపించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తనను హీరోయిన్ గా నిలబెట్టుకుంది.


తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా పూజా కెరీర్ నిర్మాణం జరుపుతోంది. బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్ 4’, ‘సర్కస్’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కొంతకాలంగా ఆమెకు సరైన బ్రేక్ లేకపోవడంతో, కథలు ఎంపికలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా కొన్ని తమిళ, హిందీ ప్రాజెక్టులతో పాటు ఓ భారీ వెబ్‌సిరీస్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ మధ్యకాలంలో గ్లామర్ షూట్లు కాకుండా ఇలాంటి క్లాసిక్ లుక్స్ షేర్ చేస్తూ పూజా ట్రెండ్ మార్చాలని చూస్తోంది. ఆమె చీరలుక్‌కి నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు బికినీ లో కూడా పూజా మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక"బికినిలో కంటే చీరలోనే అందంగా ఉన్నావ్" అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.