Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : ఇస్మార్ట్‌ బ్యూటీ అందాల షో

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో 2018లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్‌.

By:  Tupaki Desk   |   26 May 2025 12:53 PM IST
Tollywood Actress Nabha Natesh
X

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో 2018లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ కన్నడ బ్యూటీ 2015లో వజ్రకాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. వజ్రకాయ తర్వాత తెలుగులో ఈ అమ్మడు లీ, సాహెబా సినిమాలు చేసింది. ఆ సినిమాలు నభాకు పాజిటివ్ రెస్పాన్స్‌ను తెచ్చి పెట్టాయి. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న నభా నటేష్ ఆ తర్వాత అదుగో సినిమాలో నటించింది. ఈ అమ్మడికి లక్కీగా ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇస్మార్ట్‌ శంకర్‌లో ఈమె పోషించిన మాస్‌ పాత్రకు మంచి మార్కులు దక్కాయి.


పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో నభా నటేష్‌కి ఇస్మార్ట్‌ బ్యూటీ అనే పేరు దక్కింది. ఆ సినిమా సూపర్‌ హిట్ అయినా ఆ వెంటనే కరోనా కారణంగా నభా నటేష్‌కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఇస్మార్ట్‌ క్రేజ్‌ను నభా నటేష్ పెద్దగా సద్వినియోగం చేసుకోలేక పోయింది. గత ఏడాది డార్లింగ్‌ అనే వెబ్‌ మూవీలో నటించడం ద్వారా మరోసారి తన నటన ప్రతిభ కనబర్చింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం ఈ అమ్మడు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడికి ఏకంగా 5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్‌గా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలకు మంచి రీచ్‌ దక్కుతూ ఉంటుంది. ఫోటోలు షేర్ చేసిన వెంటనే వేలాది మంది అభిమానులు, ఫాలోవర్స్ లైక్ చేయడంతో పాటు, కామెంట్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలకు సోషల్‌ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్‌ దక్కింది. ఇస్మార్ట్‌ బ్యూటీ అందాల షోకి చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. వైట్ టాప్‌లో నడుము అందం చూపిస్తూ కవ్విస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ కవ్వింపులకు అంతా ఫిదా అవుతున్నారు. స్కిన్‌ షో తో హొయలు పోతున్న ఈ అమ్మడు మరోసారి అందం తో మతి పోగొడుతోంది. ఇంత అందంగా ఉన్న నభా నటేష్‌కి ఇండస్ట్రీలో ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.


ఆ మధ్య ఒక తమిళ సినిమాలో నటించబోతుంది అనే వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ సినిమాలో ఈమెను తీసుకోకుండానే షూటింగ్‌ ప్రారంభించారట. తమిళ్‌లోనే కాకుండా ఈమె తెలుగు, కన్నడ సినిమాలో కూడా ఆఫర్లు వస్తాయని ఆశించింది. కానీ ఆఫర్ల విషయంలో ఆమెకు ఎప్పుడూ నిరాశే మిగిలింది. టాలీవుడ్‌లో చేసిన ప్రతి సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా లక్‌ కలిసి రాకపోవడంతో ఇక్కడ స్టార్‌డం దక్కలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా పదేళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ రాకపోవడంతో ఎదురు చూస్తున్న ఈఅమ్మడు ముందు ముందు అయినా టాలీవుడ్‌తో పాటు, ఇతర సౌత్‌ భాషల్లో బిజీ అయ్యేనా చూడాలి.