పిక్‌టాక్ : అందమైన లొకేషన్‌లో అందాల ముద్దుగుమ్మ
తెలుగు ప్రేక్షకులకు 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్.
By: Tupaki Desk | 14 July 2025 11:35 AM ISTతెలుగు ప్రేక్షకులకు 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ . తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయగలిగింది. అంతే కాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా తరహాలో ఉందంటూ చాలా మంది జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ మెహ్రీన్‌కి ముద్దుగా పేరు పెట్టుకున్నారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా స్థాయిలో జూనియర్ మిల్కీ బ్యూటీ మెహ్రీన్‌కి లక్ కలిసి రాలేదు, అంతే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఐదారు సంవత్సరాల పాటు వరుస సినిమాలు చేసిన మెహ్రీన్ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్త స్లో అయింది.
గత రెండు సంవత్సరాలుగా ఈమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఈమె చివరిగా 2023లో స్పార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా నిరాశ పరచడం తో కొత్త ఆఫర్లు ప్రస్తుతానికి ఏమీ రావడం లేదు. ఒక కన్నడ మూవీ ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అది హిట్ అయితే తప్ప కెరీర్‌లో ముందుకు సాగే పరిస్థితి లేదు. సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు క్రొయేషియా దేశానికి విహార యాత్రకు వెళ్లింది. అక్కడ రాజధాని జాగ్రెబ్ తర్వాత అతి పెద్ద రెండవ నగరం అయిన స్ప్లిట్ అనే చారిత్రాత్మక నగరంలో చిల్ అవుతుంది. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మోడ్రన్ డ్రెస్‌లతో పాటు, అప్పుడప్పుడు చీర కట్టులోనూ మెహ్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఈసారి విభిన్నమైన ఊసరవెల్లి తరహా డ్రెస్‌ను ధరించింది. పైన ధరించిన కోర్ట్‌కి బటన్స్ పెట్టకుండా అందాల ఆరబోత చేస్తుంది. మెహ్రీన్ ఎంతటి అందాల ఆరబోత చేసినా కూడా ఎబెట్టుగా ఎప్పుడూ అనిపించదు. చాలా అందంగా ఉంటుందని నెటిజన్స్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ అంటూ ఉంటారు.
ఇంత అందంగా ఉన్న మెహ్రీన్‌కు ఆఫర్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. కనుక ముందు ముందు అయినా ఈ అమ్మడు హీరోయిన్‌గా బిజీ అవుతుందేమో చూడాలి. తెలుగులో మరొక్క ఆఫర్ వస్తే ఈ అమ్మడు తనను తాను నిరూపించుకుంటుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి మెహ్రీన్‌కు మరో ఛాన్స్‌ను తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇచ్చేనా అనేది చూడాలి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈమెకు ఆఫర్లు వస్తాయనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
