Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : మెహ్రీన్‌ ఎలా అయ్యిందో చూడండి

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌.

By:  Tupaki Desk   |   10 Jun 2025 5:00 PM IST
పిక్‌టాక్‌ : మెహ్రీన్‌ ఎలా అయ్యిందో చూడండి
X

నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈ అమ్మడు మొదటి సినిమాలో అందంతో ఆకట్టుకోవడంతో పాటు జూనియర్‌ మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా రేంజ్‌లో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఫ్యూచర్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు లక్‌ కలిసి రాలేదు. హీరోయిన్‌గా చేసిన సినిమాల్లో కొన్ని సూపర్‌ హిట్‌ అయ్యాయి. అయినా కూడా యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా ఈ అమ్మడికి నటించే అవకాశం దక్కలేదు. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన మెహ్రీన్ ఈ మధ్య సినిమాలే చేయడం లేదు.


చివరగా మెహ్రీన్‌ తెలుగులో 'ఎఫ్‌ 3' సినిమాలో కనిపించింది. ఎఫ్‌ 2 లో ఈమె చేసిన హనీ పాత్రకు మంచి స్పందన దక్కింది. అందుకే ఎఫ్‌ 3 లోనూ అదే పాత్రలో మెహ్రీన్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి నటింపజేశాడు. ఎఫ్ 3 సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. దానికి తోడు మెహ్రీన్‌ పాత్ర మరీ నాసిరకంగా ఉంది అంటూ విమర్శలు వచ్చాయి. అందుకే మెహ్రీన్‌ హీరోయిన్‌గా తెలుగులో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. ప్రస్తుతం ఒక కన్నడ మూవీ తప్ప మరే సినిమాలను ఈ అమ్మడు చేయడం లేదు. త్వరలో తెలుగులో ఈమె సినిమాలు చేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.


సినిమాలతో పెద్దగా సందడి చేయకున్నా హీరోయిన్‌గా ఆఫర్లు రాకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె షేర్ చేసే అందాల స్కిన్‌ షో ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. మెహ్రీన్‌ హీరోయిన్‌గా వచ్చిన పాపులారిటీ కంటే ఆమె అందంగా కనిపిస్తూ షేర్ చేసిన ఫోటోల వల్ల వచ్చిన పాపులారిటీ ఎక్కువ అనే అభిప్రాయం సైతం కొందరు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆకట్టుకునే మెహ్రీన్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుందని మరో సారి నిరూపితం అయింది. అందంగా కనిపించడం మాత్రమే కాకుండా ఫోటోలకు అద్భుతమైన ఫోజ్‌లు ఇవ్వడం అనేది మెహ్రీన్‌కి మాత్రమే సాధ్యం అంటూ ఉంటారు.


తాజాగా ఈ అమ్మడు రెడ్‌ టాప్‌ ధరించి విభిన్నమైన డిజైన్‌ తో ఉన్న పాయింట్‌ను ధరించింది. అంతే కాకుండా తలకు స్కార్ఫ్‌ కట్టుకుంది. నడుము అందం చూపిస్తూ ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ మెహ్రీన్‌ సొంతం అంటూ ఉంటారు. ఈ ఫోటోలను చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ఆ మాట అనాల్సిందే. మెహ్రీన్‌ ఇంతటి అందంను ఉంచుకుని సరిగ్గా సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చి ఇకపై అయినా వరుస సినిమాల్లో మెహ్రీన్‌ నటిస్తే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లో మెహ్రీన్‌ రీ ఎంట్రీ సాధ్యమేనా అనేది చూడాలి.