థై స్లిట్ లెహంగాలో మీనాక్షి కిల్లర్ ఫోజ్
అందానికి అందం ప్రతిభ రెండూ ఉంటే `స్కై ఈజ్ లిమిట్` అన్న చందంగా ఎదిగేందుకు ఛాన్సుంది.
By: Tupaki Desk | 17 May 2025 9:29 AM ISTఅందానికి అందం ప్రతిభ రెండూ ఉంటే `స్కై ఈజ్ లిమిట్` అన్న చందంగా ఎదిగేందుకు ఛాన్సుంది. గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో నేటితరం నటీమణులు దూసుకెళుతున్నారు. మునుపటితో పోలిస్తే పెద్దతెర, ఓటీటీ తెరపై ప్రయోగాత్మక కథలు తెరకెక్కుతున్నాయి. దానికి తగ్గట్టే నటీమణులకు కూడా నటించేందుకు స్కోప్ పెరిగింది. ఆ కోవలో చూస్తే నేటితరం హీరోయిన్ మీనాక్షి చౌదరి తదుపరి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలో అవకాశం అందుకుంటోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో మీనాక్షి చౌదరి `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మీనాక్షి తదుపరి `అనగనగ ఒక రాజు`లో నవీన్ పోలిశెట్టితో కలిసి కనిపించనుంది. తాజా కథనాల ప్రకారం, మీనాక్షి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. స్త్రీ 2 నిర్మాత దినేష్ విజన్ సినిమాలో కీలక పాత్రను పోషించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. మాడాక్ ఫిల్మ్స్ మీనాక్షి కోసం ఒక స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో హీరో ఎవరో ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మరోవైపు మీనాక్షి సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ ని నిరాశపరచడం లేదు. వరుసగా క్రేజీ మ్యాగజైన్ కవర్ షూట్లతోను మీనాక్షి అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఫేస్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అద్భుతమైన ట్రెడిషనల్ లెహంగాలో దర్శనమిచ్చింది. అయితే ఇది చూడటానికి సాంప్రదాయబద్ధంగా కనిపించినా థై స్లిట్ ఎలివేషన్ తో మోడ్రన్ టచ్ ని మీనాక్షి చూపించింది. డిజైనర్ బ్లౌజ్, ఇన్నర్ అందాలను తాకుతూ దుపట్టా, బాటమ్ లో థై స్లిట్ ఎలివేషన్ ప్రతిదీ దేనికదే ప్రత్యేకం. `ది ఆర్ట్ ఆఫ్ బికమింగ్: మీనాక్షి రీన్ ఆఫ్ రీఇన్వెన్షన్` పేరుతో సరికొత్త కవర్ స్టార్‌గా మీనాక్షిని `ఫేస్` మ్యాగజైన్ ప్రెజెంట్ చేస్తోంది. నేటి జెన్ జెడ్ హీరోయిన్ మీనాక్షి కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది.
