మడత పడిన నడుముతో దేవియాని గ్లామర్ ట్రీట్
ఎక్స్‌ప్రెషన్స్, ఆ అటిట్యూడ్… చూస్తుంటే అందరి ఫోకస్ ఆమెపై యూ టర్న్ తీసుకోకుండా ఉండదు.
By: Tupaki Desk | 12 May 2025 10:42 AM ISTఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా యాక్టివిటీతో ఎప్పుడూ ఫోకస్‌లో ఉండే నార్త్ బ్యూటీ దేవియాని శర్మ తాజాగా షేర్ చేసిన గ్లామర్ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫాలోవర్లకు అందించిన ఈ లుక్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఎర్ర రంగు బ్లౌజ్, ఆకుపచ్చ చీరతో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన దేవియాని తన గ్లామర్ లుక్‌తో ఫోటోషూట్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది.
ఎక్స్‌ప్రెషన్స్, ఆ అటిట్యూడ్… చూస్తుంటే అందరి ఫోకస్ ఆమెపై యూ టర్న్ తీసుకోకుండా ఉండదు. ఫొటోలు చూసిన నెటిజన్లు ‘ఫైర్’ కామెంట్లతో ఫుల్ ట్రెండ్‌లోకి తీసుకొస్తున్నారు. దేవియాని శర్మ మొదటగా యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో వెలుగులోకి వచ్చారు. 'సేవ్ ది టైగర్స్', 'షైతాన్', వంటి వెబ్ కంటెంట్ ప్రాజెక్టుల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ముఖ్యంగా సైతాన్ సిరీస్‌లో ఆమె పోషించిన ఇంటెన్స్ క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవియాని ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నైపుణ్యం ఉండటంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెడుతున్న దేవియాని త్వరలో టాలీవుడ్‌లో ఒక మంచి పాత్రతో రాబోతున్నట్లు సమాచారం.
తెలుగులో ఆమెకు పూర్తి స్థాయి గ్లామర్ రోల్స్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌ను హైలైట్ చేసే పాత్రలపై ఆసక్తి ఉంది. ఈ మధ్య వచ్చిన ఓ ఫోటోషూట్‌లో కూడా ఆమె స్టన్నింగ్‌గా కనిపించడం చూస్తే, స్టార్ ఇమేజ్ కోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నదో అర్థమవుతోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా చాలా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెస్ చెబుతుండగా, ఆమె పోస్ట్ చేసిన స్టైలిష్ లుక్స్‌కి హృదయాలే పెట్టేశారు. దేవియాని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బ్యూటీ. ఇన్‌స్టా రీల్స్, ట్రెండింగ్ ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటూ కెరీర్ పరంగానూ ముందుకు సాగుతోంది.
