Begin typing your search above and press return to search.

సుప్రీతా గ్లామర్ ట్రీట్... స్టన్నింగ్ బ్యూటీ!

గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి చాలా కాలం కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సుప్రీతా అనే పేరు మార్మోగిపోతోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2025 10:00 AM IST
సుప్రీతా గ్లామర్ ట్రీట్... స్టన్నింగ్ బ్యూటీ!
X

గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి చాలా కాలం కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సుప్రీతా అనే పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్టైలిష్ ఫోటోషూట్లతో యూత్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేలా వేసిన స్టన్నింగ్ స్టైలింగ్ ఇప్పుడు ఫ్యాషన్ ఫీడ్‌గా మారింది.


ఈ ఫొటోల్లో సుప్రీతా లైట్ బ్రౌన్ బ్రాలెట్ టాప్, బ్లాక్ బాటమ్‌తో అందాల‌ను ఆరబోస్తూ స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఇస్తోంది. సన్‌గ్లాసెస్‌, గోల్డెన్ యాక్సెసరీస్‌తో గ్లామర్ లుక్‌ను పెంచేసింది. ఆమె బాడీ లాంగ్వేజ్, ఫోజింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టూల్ పక్కన నిలబడి హై కాంఫిడెన్స్‌తో ఇచ్చిన హాట్ స్టాన్స్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. కేవలం ఇన్‌డోర్‌లోనే కాకుండా, బీచ్ పక్కన నిలబడి ఇచ్చిన బ్యాక్ షాట్ ఫోటో కూడ ఎక్కువ లైక్స్‌ని రాబడుతోంది.


ఇప్పుడు సోషల్ మీడియాలో సుప్రీతా కి ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఇన్‌స్టాలో ఆమెకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఈ మధ్య వచ్చిన వీడియోలు, రీల్స్‌ను బట్టి చూస్తే.. ఫిట్‌నెస్‌కి సంబంధించి కూడా ఆమె చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అవుట్‌ఫిట్ లో అయినా డిఫరెంట్ స్టిల్స్ ఇస్తూ పోజులిచ్చే దారిలో ఉన్న ఈ మోడల్.. త్వరలోనే సినిమాల్లో అవకాశం కొట్టేస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.


ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రీతా కేవలం గ్లామర్ షాట్లకే కాదు, ట్రావెల్‌, లైఫ్‌స్టైల్, బ్యూటీ టిప్స్‌కు సంబంధించిన పోస్ట్‌లతోనూ ఆకట్టుకుంటోంది. ఆమె ప్రస్తుతం ఓ ప్రముఖ బ్రాండ్‌కు ఫీచర్ మోడల్‌గా వ్యవహరిస్తోంది. టాలీవుడ్‌లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలోని సమాచారం. ఇదిలా ఉండగా ఆమె లేటెస్ట్ హాటలుక్స్ చూసిన నెటిజన్లు క్రష్ ఆఫ్ ద డే అంటూ కామెంట్లు పెడుతున్నారు.