Begin typing your search above and press return to search.

నెవ్వర్ బిఫోర్ అనేలా అనసూయ గ్లామర్ ఫైర్

టాలీవుడ్‌ లో యాంకర్‌గా, ఆ తర్వాత నటిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ.. తన వర్సటైల్ టాలెంట్‌తో మంచి క్రేజ్ అందుకుంది.

By:  Tupaki Desk   |   19 April 2025 7:07 AM
Tollywood Actress Anasuya Bharadwaj
X

టాలీవుడ్‌ లో యాంకర్‌గా, ఆ తర్వాత నటిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ.. తన వర్సటైల్ టాలెంట్‌తో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా మారి, తన పెర్ఫార్మెన్స్‌తో ప్రశంసలు అందుకుంది. తర్వాత పుష్ప వంటి ప్రాజెక్ట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించింది. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అనసూయకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆమె అందం, అభినయం, యాటిట్యూడ్ అన్నీ కలిపి ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ కనెక్ట్ కలిగించాయి.


ప్రస్తుతం అనసూయ హోస్ట్ చేస్తున్న ‘కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ 2’ షోలో ఆమె హోస్టింగ్ స్కిల్స్‌కి మెచ్చిపోతున్నారు. అయితే అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఆమె లుక్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఓ మెటాలిక్ గ్రీన్ కాస్ట్యూమ్‌తో, పింక్ టై వేసుకుని స్టైలిష్ పోజులతో మెరుపులు మెరిపించింది. బ్యాక్ స్టేజ్ సెట్టింగ్‌లో తీసిన ఈ ఫోటోలు.. ఆమె గ్లామర్, కాన్ఫిడెన్స్ రెండింటినీ హైలైట్ చేశాయి.


ఈ లుక్‌లో అనసూయ తన బోల్డ్‌నెస్‌కి మరోసారి డెఫినిషన్ ఇచ్చింది. పొట్టి స్కర్ట్, స్లీవ్‌లెస్ కట్ టాప్‌లో అనసూయ ఇచ్చిన పొజులు ఫోటోగ్రఫీకి ఓ క్లాస్ ఫీల్ తీసుకురాగా, ఆమె బాడీ లాంగ్వేజ్ మరింతగా ఆకట్టుకుంది. జ్యువెలరీ లేకపోయినా.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తోనే లుక్‌ని ఎలివేట్ చేసింది. మేకప్ సింపుల్ అయినా స్టైలిష్ గా ఉంటుంది అనే విషయం మళ్లీ నిరూపించింది.


ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అనసూయ గ్లామర్ అండ్ గ్రేస్ వేరే లెవెల్, ఈ లుక్ గేమ్ చెంజర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె చేస్తున్న ప్రోగ్రామ్‌స్ అందమే పర్ఫెక్ట్ ప్రోమోషన్‌లా మారింది. ఎలాంటి షో చేసినా కూడా అనసూయ లుక్ ద్వారా మరింత రెస్పాన్స్ వస్తోందని టాక్. మొత్తానికి అనసూయ ఒకసారి మళ్లీ ట్రెండింగ్‌లోకి ఎంటరైంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే రెండు తమిళ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా అనసూయ కీలక పాత్రల్లో నటిస్తోంది.