చీరలో అనసూయ గ్లామర్ మాయ.. స్టన్నింగ్ లుక్!
ఇంతకు ముందు ఆమె వేసిన మోడ్రన్ అవుట్‌ఫిట్లు వైరల్ అయ్యాయి. అలాగే ఈ చీర లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 3 April 2025 10:28 AMటీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన నటి. క్షణం, రంగస్థలం, ‘పుష్ప’ వంటి సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో నటిగా మెప్పించింది. అలాగే జబర్దస్త్ షోతో స్టార్ యాంకర్‌గా దూసుకెళ్లిన ఆమె.. ఇప్పుడు కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2తో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చీర కట్టులో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
వయిలెట్ కలర్ చీరను ట్రెండీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కంబినేషన్ చేస్తూ, తనదైన శైలిలో కనిపించింది. ఎల్లప్పుడూ చీర యుగంలో.. అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సింపుల్ మేకప్, ముత్యాల చెవి కమ్మలు, క్యూట్ నవ్వుతో అనసూయ అందంగా మెరిసిపోయింది. ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ చూపించడంలో అనసూయ ప్రత్యేకత కనబరుస్తోంది.
ఇంతకు ముందు ఆమె వేసిన మోడ్రన్ అవుట్‌ఫిట్లు వైరల్ అయ్యాయి. అలాగే ఈ చీర లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎన్ని డ్రెస్‌లైనా... చీరలోనే మీరు మరింత అందంగా కనిపిస్తారు.. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్‌తో పాటు ఆమె ప్రొఫెషనల్‌గా కూడా బిజీగా ఉంది. వెబ్ సిరీస్‌లతో పాటు, సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తూ అభిమానుల మద్దతు కూడగడుతోంది.
రజాకర్ సినిమాలో కూడా ఆమె పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. టీవీలో కూడా యాంకరింగ్ కొనసాగిస్తూ, సోషల్ మీడియాలో గ్లామర్‌తోనూ ప్రెజన్స్ మెయింటెయిన్ చేస్తోంది. అనసూయ ఫొటోలు చూస్తే.. 'సారీ గాళ్' మూడ్‌లో ఆమె మాయ చేస్తోంది అని చెప్పాలి. సింపుల్ కానీ స్టైలిష్ లుక్, కాంపోజర్‌తో పాటు నాజూకు ఫోజులు.. అన్నీ కలిపి ఈ ఫోటోషూట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇకపోతే ఈ ఫోటోలకు ఇప్పటికే వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. మరి భవిష్యత్తులో అమ్మడు చేసే పాత్రలు ఏ రేంజ్ లో క్లిక్ అవుతాయో చూడాలి.