టాలీవుడ్ గోల్డెన్ ఇయర్ 2026.. ఈ సినిమాలతో వేల కోట్ల బిజినెస్!
సినిమాలు కంటెంట్ తో బాక్సాఫీస్ బార్డర్ దాటుతున్న దశలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
By: Tupaki Desk | 10 April 2025 12:30 AMసినిమాలు కంటెంట్ తో బాక్సాఫీస్ బార్డర్ దాటుతున్న దశలో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక 2026 సంవత్సరం సినిమా చరిత్రలోనే అత్యంత భారీ సంవత్సరంగా నిలవబోతోంది. స్టార్ హీరోలు అందరూ బిగ్ బడ్జెట్ సినిమాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు భారీ సినిమాలు ఇప్పటికే 2026 క్యాలెండర్లో లాక్ అయిపోయాయి. ఈ సినిమాల సంఖ్య చూసిన ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ తారస్థాయికి చేరింది.
ఈ మాస్ ఫెస్టివల్ కు మొదట శ్రీకారం చుట్టేది మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ నెక్స్ట్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో చిరు హ్యూమర్, యాక్షన్ రెండింటినీ సమపాళ్లలో చూపించనున్నారట. సంక్రాంతి బరిలో చిరంజీవి చిత్రానికి పోటీగా ఇతర సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నా, మెగా ఫ్యాన్స్ ఊపు మాత్రం ఆగదు. తప్పకుండా సినిమా 300 కోట్లకు పైగా బిజినెస్ చేయవచ్చు.
మార్చ్ లోనూ వేరే లెవెల్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైస్’ అనే ప్రయోగాత్మక సినిమా రానుంది. ఈ సినిమా కూడా 250 కోట్లకు పైనే బిజినెస్ చేయవచ్చు. అదే నెలలో రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది. చరణ్ గ్రామీణ యువకుడిగా, క్రికెట్ నేపథ్యంతో కనిపించనున్న ఈ సినిమా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ రెండు కూడా 2026 మార్చి చివరి వారంలో రానున్నాయి. ఇక పెద్ది సినిమా బిజినెస్ 500 కోట్లకు పైనే ఉండవచ్చు.
అలాగే వేసవిలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మాస్ సినిమా రాబోతుంది. అదే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. ఈ కాంబినేషన్ దుమ్ము లేపేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటిదాకా టైటిల్ కూడా రానప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, డార్క్ స్టోరీటెల్లింగ్ తో ఎన్టీఆర్ మాస్ మసాలా ఫ్యాన్స్ కు ఓ గొప్ప ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ కూడా 1000 కోట్లకు పైనే ఉండవచ్చు.
ఇంకా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా ఖాళీ లేదు. ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ కూడా మరో హైలెట్ అయ్యే ప్రాజెక్టు. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తుండగా, మరో వైపు ‘ఫౌజీ’ అనే చిత్రంతో కొత్త యాంగిల్ చూపించనున్నాడు. రెండూ లవ్, యాక్షన్ మిక్స్‌తో ఉండే సినిమాలే కావడంతో బాక్సాఫీస్ వద్ద 2000 కోట్లకు పైగా రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ సినిమా డిసెంబర్ నాటికి రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాకు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టచ్ ఉండనుందని తెలుస్తోంది. ఈసారి బన్నీ టార్గెట్ 2000 కోట్లకు ఉండవచ్చు.
ఈ భారీ లైనప్ చూస్తే.. 2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఒక్కో సినిమాకు రూ.500 కోట్లకు పైగా మార్కెట్ ఉందని ట్రేడ్ టాక్. మొత్తం కలిపితే రూ.5000 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఫ్యాన్స్ దాదాపుగా ఏడాది పొడవునా థియేటర్లలోనే ఉండేలా, సినిమాల విందు అందించేందుకు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. 2026.. టాలీవుడ్ కు నిజంగా గోల్డెన్ ఇయర్ గా నిలవనుంది.