2025 ఫస్టాప్ ప్లాపా? హిట్టా?
2025 ద్వితియార్దంలోకి వచ్చేసాం. అప్పుడే కొత్త ఏడాది మొదలై సగం పూర్తయింది.
By: Tupaki Desk | 6 May 2025 4:30 PM2025 ద్వితియార్దంలోకి వచ్చేసాం. అప్పుడే కొత్త ఏడాది మొదలై సగం పూర్తయింది. ఇప్పటికే మాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల కాలం వందకు పైగా సినిమాలు రిలీజ్ అయినా వాటిలో విజయం సాధించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువగానే కనిపించింది. మరి టాలీవుడ్ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడా పరిస్తితి మాలీవుడ్ తరహాలోనే కనిపిస్తుంది.
ఈ నాలుగు నెలల కాలంలో 70కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమాల సంఖ్య ఆధారంగా చూసుకుంటే 70 గా తేలింది. వీటిలో ఎన్ని చిత్రాలు విజయాలు సాధించా యి? అంటే కేవలం ఐదు సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అలాగే బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` యావరేజ్ గా ఆడింది. అటుపై ఫిబ్రవరిలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన `తండేల్` పాన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఆ సినిమాతో చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. దీంతో `తండేల్` గ్రాండ్ విక్టరీ నమోదు చేసినట్లు అయింది. ఆ తర్వాత చూసు కుంటే `మ్యాడ్ స్క్వేర్` మంచి విజయం సాధించింది. ముగ్గురు తెలిసిన ముఖాలు కావడం యూత్ పుల్ కాన్సెప్ట్ కావడంతో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
ఇటీవల రిలీజ్ అయిన `కోర్టు` కూడా మంచి విజయం సాధించింది. నటించింది అంతా కొత్తవాళ్లే అయినా? కంటెంట్ ఉన్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు తెచ్చి పెట్టింది. కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన నాని `హిట్ 3 `కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా ఐదారు సినిమాలు మాత్రమే 70 లోసక్సెస్ అయిన చిత్రాలుగా కనిపిస్తున్నాయి.
దీంతో నాలుగైదు నెలల కాలంలో టాలీవుడ్ సక్సెస్ ఎంతకు పడిపోయిందో అంచనా వేయోచ్చు. కనీసం పది సక్సెస్ లు కూడా లేవకపోవడం అంటే? కంటెంట్ ఎంత బలహీనంగా ఉందో అర్దమవుతుంది. వచ్చే ఆరు నెలల కాలంలోనైనా మెరుగైన ఫలితాలు సాధించకపోతే సక్సెస్ రేట్ మరింత దారుణంగా పడి పోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.