Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ సరుకు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్

ఇంట్లో ఒటీటీ ఛానల్స్ లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల కారణంగా టీవీ సీరియల్స్ కి కూడా వ్యూయర్ షిప్ తగ్గిపోయింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 5:09 AM GMT
ఈవారం ఓటీటీ సరుకు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్
X

ఒటీటీ ఛానల్స్ వచ్చిన తర్వాత థియేటర్స్ లో సినిమాలు చూసే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు. లేదంటే ఒటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీస్ ని ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఒటీటీ ఛానల్స్ లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల కారణంగా టీవీ సీరియల్స్ కి కూడా వ్యూయర్ షిప్ తగ్గిపోయింది.

ప్రతి వారం ఒటీటీ ఛానల్స్ లో కొత్త సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ లు డిఫరెంట్ లాంగ్వేజ్ ల నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా బ్రాండ్ వేసి అన్ని సినిమాలు నాలుగు, ఐదు భాషలలో డబ్బింగ్ చేసి ఒటీటీలలో వదులుతున్నారు. అలాగే వెబ్ సిరీస్ లు కూడా మల్టీ లింగ్వల్ గానే వస్తున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలో ఆడియన్స్ కోసం ఈ పద్ధతి ఫాలో అవుతున్నాయి.

అందుకే ఇతర భాషలలో తెరకెక్కిన సినిమాలు, వెబ్ సిరీస్ లు తెలుగులో వస్తున్నాయి. ఈ వారం ఒటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి చూసుకుంటే కార్తీక్ రత్నం హీరోగా, రవితేజ నిర్మించిన చాంగురే బంగారు రాజా మూవీ ఈటీవీ విన్ లో అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నయనతార, జయం రవి కాంబోలో తెరకెక్కిన ఇరైవన్ నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

లారెన్స్, కంగనా కాంబోలో తెరకెక్కిన చంద్రముఖి 2 కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ మూవీ పెయిన్ హజ్లర్స్ 27 నుంచి సందడి చేయనుంది. అమెజాన్ ప్రైమ్ లో ఆస్పిరెంట్స్ హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అలాగే హాలీవుడ్ నుంచి ట్రాన్స్ ఫార్మర్స్ కూడా రిలీజ్ అయ్యింది. కాన్ సీక్రేషన్ అనే హాలీవుడ్ మూవీ 27న రిలీజ్ కాబోతోంది.

ఆహాలో ఇప్పటికే క్రిష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే చిన్న సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే కేస్ 30, సురాపానం అనే రెండు సినిమాలు నేటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దూరంగా అనే వెబ్ సిరీస్ జీ5లో అక్టోబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ లో నిత్యా మీనన్ మలయాళీ వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది.