Begin typing your search above and press return to search.

పూర్తిగా ఓటీటీకి అంకిత‌మైన అగ్ర సినీ కుటుంబం

ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ వేగంగా ఊపందుకునేందుకు అక్క‌డ ప్ర‌ముఖ స్టార్లు అంతా ఎలాంటి భేష‌జానికి పోకుండా ఓటీటీకి అంకిత‌మ‌వ్వ‌డ‌మే కార‌ణం.

By:  Tupaki Desk   |   16 Feb 2024 8:12 PM GMT
పూర్తిగా ఓటీటీకి అంకిత‌మైన అగ్ర సినీ కుటుంబం
X

క‌రోనా వైర‌స్ భార‌త‌దేశంలో ప్ర‌వేశించ‌క ముందు నుంచి చాలా మంది స్టార్లు ఓటీటీ రంగంలో అడుగులు వేసారు. అయితే క‌రోనా స‌మ‌యంలో ఈ స్పీడ్ మ‌రింత‌గా పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ వేగంగా ఊపందుకునేందుకు అక్క‌డ ప్ర‌ముఖ స్టార్లు అంతా ఎలాంటి భేష‌జానికి పోకుండా ఓటీటీకి అంకిత‌మ‌వ్వ‌డ‌మే కార‌ణం. అజయ్ దేవగన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కాజోల్, విద్యాబాలన్, అలియా భట్, సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మీ సహా చాలా మంది పెద్ద స్టార్లు ఓటీటీలో న‌టించారు.

అయితే ఒక కుటుంబం మొత్తం పూర్తిగా OTTకి అంకిత‌మైపోవ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌గా మారింది. పటౌడీ కుటుంబం నుంచి వ‌చ్చిన బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ సేక్రేడ్ గేమ్స్ .. హాట్‌స్టార్ చిత్రం భూత్ పోలీస్‌లో తన పాత్రలతో ఛేంజ్ చూపించాడు. ప్రస్తుతం అతడు మరొక OTT సిరీస్ జ్యువెల్ థీఫ్‌లో న‌టిస్తున్నాడు. అత‌డి భార్య కరీనా కపూర్ నెట్‌ఫ్లిక్స్‌ జానేజాన్‌తో OTT అరంగేట్రం చేసింది. క‌రీనా OTT లో ఇత‌ర‌ ప్రాజెక్ట్‌లకు క‌మిట‌వుతోంది.

సైఫ్ గారాల‌ కుమార్తె, యువ‌నాయిక‌ సారా అలీ ఖాన్ ఇప్పటికే అట్రాంగి రే - గ్యాస్‌లైట్ వంటి OTT చిత్రాలలో తనదైన ముద్ర వేసింది. మర్డర్ ముబారక్ అనే సినిమాలో న‌టిస్తున్న సారా కరణ్ జోహార్ ఏ వతన్ మేరే వతన్ లోను న‌టిస్తోంది. సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా `నాదనియన్` అనే ప్రాజెక్ట్‌లో ఖుషీ కపూర్‌తో కలిసి OTT రాజ్యంలో అరంగేట్రం చేస్తున్నాడు. సైఫ్ బావ కునాల్ కెమ్ము కూడా లూట్‌కేస్ - పాప్ కౌన్ వంటి సినిమాలు... వెబ్ సిరీస్‌లతో అల‌రించాడు. ఈ జాబితాలో సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా చేరింది. ప్రైమ్ వీడియో కోసం హుష్ హుష్ సహా ప‌లు OTT ప్రాజెక్ట్‌లతో సోహా బిజీగా ఉంది. పటౌడీ కుటుంబం మొత్తం వెండితెర ఆశను కోల్పోయి పూర్తిగా OTT వైపు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సైఫ్ ఖాన్ ఇటీవ‌ల సౌత్ లోను అడుగు పెట్టి ఇక్క‌డ వ‌రుస చిత్రాల‌తో బిజీ అవుతున్నాడు. ఇక్క‌డ విల‌న్ పాత్ర‌ల్లోను న‌టిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.