Begin typing your search above and press return to search.

మాస్ రాజా టైగర్ కు ఆ ఏరియాలో హై డిమాండ్

రాయలసీమలోనే ఈ స్థాయిలో బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి నైజాం, ఆంధ్రాలో కూడా భారీగా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 3:57 AM GMT
మాస్ రాజా టైగర్ కు ఆ ఏరియాలో హై డిమాండ్
X

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాదిలో ఇప్పటికే వాల్తేర్ వీరయ్య, రావణాసుర సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వీటిలో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరొకటి డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో దసరాకి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సందడి మొదలైంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బయోపిక్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

వంశీకృష్ణ ఆకెళ్ళ ఎంతో వర్క్ చేసి ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. మాస్ రాజాలో మరో వేరియేషన్స్ ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. టీజర్ బాగుండటంతో మూవీపై బిజినెస్ డీల్స్ కూడా బాగానే జరుగుతున్నాయంట. అదే సమయంలో ఇళయదళపతి విజయ్ లియో మూవీ రిలీజ్ కానుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వీటికి ఒక్క రోజు తేడాలో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాపై రాయలసీమలో ఏకంగా 5.40 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. అది కూడా నాన్ రిఫండ్ ఎమౌంట్ రైట్స్ క్రింద హక్కులని ఓ డిస్టిబ్యూటర్ సొంతం చేసుకున్నారంట. రాయలసీమలోనే ఈ స్థాయిలో బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి నైజాం, ఆంధ్రాలో కూడా భారీగా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

రెండు పెద్ద సినిమాలు పోటీలో ఉన్న కూడా పీరియాడిక్ జోనర్ లో వస్తోన్న రియల్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ఎక్కువ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో కూడా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి స్టువర్టుపురం గ్రామ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే వారు కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రిలీజ్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందేమో అనే డౌట్ ఉంది.

ఇక వేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అయితే మాత్రం ఈ బయోపిక్ స్టోరీ కచ్చితంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.