Begin typing your search above and press return to search.

టైగర్ నాగేశ్వరరావు కొత్త రన్ టైమ్.. ఈసారి ఎంతంటే

ఇక ఈ సినిమా రన్ టైమ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే నిలిచింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ లేటెస్ట్ గా సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 4:23 PM GMT
టైగర్ నాగేశ్వరరావు కొత్త రన్ టైమ్.. ఈసారి ఎంతంటే
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి టాక్ వస్తోంది. టైగర్ నాగేశ్వరరావు పాత్రకి రవితేజ అయిన ప్రాణం పోశారు.


ఇక ఆ పాత్రని బలంగా రిప్రజెంట్ చేయడంలో టెక్నీషియన్స్ కూడా మరింత హార్డ్ వర్క్ చేశారు. స్టువర్ట్ పురం గజదొంగ జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా దసరా పోటీలో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే నిలిచింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ లేటెస్ట్ గా సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు టైగర్ నాగేశ్వరరావు నిడివి మూడు గంటల్లో ఉండగా ఇప్పుడు ఆ సమయాన్ని ఇంకాస్త తగ్గించడం విశేషం.

లేటెస్ట్ గా చిత్ర యూనిట్ అఫీషియల్ గా సినిమా రన్ టైమ్ పై క్లారిటీ ఇచ్చింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో సరికొత్తగా మళ్ళీ టైగర్ నాగేశ్వరరావు ను థియేటర్లోకి తీసుకువస్తున్నారు. ఒక విధంగా ఇది సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ అప్డేట్ తో సినిమాకు మరసటి రోజు నుంచి ఇంకా బజ్ పెరిగే అవకాశం అయితే ఉంది.

ఇక ఈ సినిమాలో రవితేజ నటించిన విధానం కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మాస్ రాజా గతంలో ఎప్పుడూ లేనంత డిఫరెంట్ గా ఈ క్యారెక్టర్ లో కనిపించాడు అని చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వెండితెరపై సరికొత్తగా హైలెట్ అయ్యాయి. ఆ విషయంలో అయితే టెక్నీషియన్ కు ప్రశంసలు అందుతున్నాయి.

ఇక యువ దర్శకుడు వంశీ తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మొదటిసారి రవితేజ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా టైగర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మొదటి రోజు సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. మరి కాస్త రన్ టైమ్ తగ్గించిన తరువాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.