Begin typing your search above and press return to search.

ఆ కమెడియన్ ప్లేస్ లో రాజ్ తరుణ్..!

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు తిరగబడరా సామి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా మన్నారా చోప్రా నటించింది

By:  Tupaki Desk   |   31 Aug 2023 7:49 AM GMT
ఆ కమెడియన్ ప్లేస్ లో రాజ్ తరుణ్..!
X

గోపీచంద్ తో యజ్ఞం, సౌఖ్యం.. సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తీసిన డైరెక్టర్ రవి కుమార్ చౌదరి చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమాతో వస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు తిరగబడరా సామి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జోడీగా మన్నారా చోప్రా నటించింది. సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు. తిరగబడరా సామి టీజర్ ఓకే అనిపించేలా ఉంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు రాజ్ తరుణ్.

యువ హీరోల్లో సక్సెస్ రేటులో చాలా వెనకబడి ఉన్నాడు రాజ్ తరుణ్. కథల ఎంపిక లోపమో లేక లక్ కలిసి రాకపోవడమో కానీ రాజ్ తరుణ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ఒక పక్క యంగ్ హీరోలంతా కూడా వెరైటీ సినిమాలతో దూసుకెళ్తుంటే రాజ్ తరుణ్ మాత్రం సైలెంట్ అయిపోయాడు. అందుకే రవి కుమార్ చౌదరితో కలిసి తిరగబడరా సామి సినిమా చేశాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. డైరెక్టర్ రవి కుమార్ చౌదరి ఈ సినిమాను ముందు కమెడియన్ సప్తగిరితో చేయాలని అనుకున్నారని.. ఆయన క్లైమాక్స్ విషయంలో అభ్యంతరం చెప్పడంతో డైరెక్టర్ తను అనుకున్నట్టుగానే క్లైమాక్స్ ఉండాలని అన్నారట. సో అలా సప్తగిరి బయటకు వెళ్లి ఆ ప్లేస్ లో రాజ్ తరుణ్ వచ్చాడని చెప్పుకుంటున్నారు.

సప్తగిరి కూడా ఈమధ్య కమెడియన్ గా చేస్తూనే సోలోగా సినిమాలు చేస్తున్నాడు. తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో సప్తగిరి సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే తిరగబడరా సామి సినిమా విషయంలో బయటకు వచ్చిన ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది. ఆయన కాదన్న సినిమా రాజ్ తరుణ్ కి ఏమాత్రం కలిసి వస్తుంది అన్నది చూడాలి.

ఎంచుకున్న కథని హ్యాండిల్ చేయడంలో తన సత్తా చాటుతూ వస్తున్న డైరెక్టర్ రవి కుమార్ రాజ్ తరుణ్ తిరగబడరా సామితో ఫామ్ లోకి వస్తాడా.. హిట్టు కోసం తపిస్తున్న రాజ్ తరుణ్ ని హిట్ ట్రాక్ ఎక్కిస్తాడా లేదా అన్నది చూడాలి. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మరి వారు అనుకుంటున్న సక్సెస్ సినిమా అందుకుంటుందా లేదా అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.