బ్యాచిలర్ పార్టీలో ధనశ్రీ వర్మ చిందులు
రాజ్‌కుమార్ రావు- వామికా గబ్బి నటించిన `భూల్ చుక్ మాఫ్` ఈనెలలో విడుదలకు సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 8 May 2025 1:30 AMరాజ్‌కుమార్ రావు- వామికా గబ్బి నటించిన `భూల్ చుక్ మాఫ్` ఈనెలలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర నిర్మాతలు తాజాగా సినిమా నుండి కొత్త పాటను విడుదల చేశారు. `టింగ్ లింగ్ సజ్నా..` అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ వీడియోలో పెప్పీ సాంగ్.. ఈ కొత్త ట్రాక్ ని మధుబంటి బాగ్చి - తనిష్క్ బాగ్చి ఆలపించారు. ధనశ్రీ స్వయంగా ఆన్ లొకేషన్ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఈ ఫోటోగ్రాఫ్స్ లో ధనశ్రీతో రాజ్ కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటైంది. ఆన్ సెట్స్ చిత్రబృందం బోలెడం ఫన్ ని ఎంజాయ్ చేసిందని కూడా అర్థమవుతోంది. అదే సమయంలో ధనశ్రీ మరోసారి చెలరేగి ఈ పెప్సీ ఐటమ్ నంబర్ లో అందాలు ఆరబోసింది. ధనశ్రీ బోల్డ్ లుక్ యూత్ లో గుబులు పెంచుతోంది. రాజ్ కుమార్ రావు ఒడిలో కూచున్న ధనశ్రీ ఎర్రటి సాంప్రదాయ దుస్తులలో కనిపించింది. ఆ ఇద్దరి చుట్టూ డ్యాన్సర్లు అంతే హుషారుగా కనిపిస్తున్నారు. రాజ్ అందాల ధనశ్రీ కళ్లలోకి మమేకమై చూస్తున్నాడు. మొత్తానికి ఈ పోస్టర్లను బట్టి ధనశ్రీ తెరను మరిగించడం ఖాయమని అర్థమవుతోంది. టింగ్ లింగ్ సజ్నా పాట ట్యాగ్ లైన్ ప్రకారం.. ఇది బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన సర్ ప్రైజ్ సాంగ్ అని స్పష్ఠత వచ్చింది.
దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై కరణ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భూల్ చుక్ మాఫ్ మే 9న విడుదల కానుంది. వారణాసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, చిన్న పట్టణంలోని వరుడు రంజన్ కథలో ట్విస్ట్ ఏమిటన్నది తెరపై చూడాలి. పెళ్లికి ముందు రోజు అతడు ఎదుర్కొన్న సమస్య ఏమిటన్నది వేచి చూడాలి. ఇటీవలే చాహల్ నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ వర్మ పూర్తిగా సినీకెరీర్ పై దృష్టి సారించింది. అటు తమిళం, ఇటు తెలుగు, హిందీ చిత్రాలతో బిజీ అయిపోయింది.