Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కూతురు చేసిన ప‌నికి చీవాట్లు

ఎదుటివారికి స‌ల‌హాలు ఇవ్వ‌డం.. స్వ‌యం మ‌ర్ధ‌నం వంటివి ప్ర‌జ‌ల‌కు అంతగా న‌చ్చ‌వు. స‌ల‌హాలు ఇచ్చేవారి స్టాట‌స్ కూడా దీనికి కార‌ణం కావ‌చ్చు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 9:57 AM IST
స్టార్ హీరో కూతురు చేసిన ప‌నికి చీవాట్లు
X

ఎదుటివారికి స‌ల‌హాలు ఇవ్వ‌డం.. స్వ‌యం మ‌ర్ధ‌నం వంటివి ప్ర‌జ‌ల‌కు అంతగా న‌చ్చ‌వు. స‌ల‌హాలు ఇచ్చేవారి స్టాట‌స్ కూడా దీనికి కార‌ణం కావ‌చ్చు. ప్ర‌ముఖ స్టార్ హీరో కుమార్తెకు అన‌వ‌స‌రంగా ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాన‌నుకునే ప‌రిస్థితి వచ్చింది. తాను నాలుగు మంచి మాట‌లేవో ప్ర‌జ‌ల‌కు సాటి అమ్మాయిల‌కు చెప్పాలని అనుకుంది. కానీ అది విక‌టించి తిరిగి త‌న‌కే చీవాట్లు తినాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ ఎవ‌రు ఈ స్టార్ డాట‌ర్? అంటే... ప్ర‌ఖ్యాత బాలీవుడ్ న‌టుడు గోవిందా కుమార్తె టీనా అహూజా. ప్రస్తుతం ఆయన కూతురు టీనా అహుజా వార్తల్లో నిలుస్తోంది. తాజా ఇంటర్వ్యూలో టీనా పీరియడ్స్ స‌మ‌యంలో తిమ్మిర్ల గురించి మాట్లాడింది. తనకు పర్ఫెక్ట్ సైకిల్ ఉందని, ఎప్పుడూ రుతుక్రమంలో తిమ్మిర్లు లేవని ఆమె పేర్కొంది. అయినప్పటికీ పీరియడ్స్ క్రాంప్స్ మానసికంగా ప్ర‌భావితం చేస్తాయ‌ని కూడా పేర్కొంది. అయితే దీనికి సోషల్ మీడియాలలో ఊహించ‌ని ట్రోలింగ్ ఎదురైంది. ఇంటర్వ్యూలో టీనా మాట్లాడుతూ ``ముంబయి , ఢిల్లీ నుండి వచ్చిన అమ్మాయిలు మాత్రమే పీరియడ్స్ క్రాంప్ గురించి మాట్లాడతారు. తాను చండీగఢ్‌లో ఎక్కువ సమయం ఉంటున్నానని, ఢిల్లీ , బొంబాయికి చెందిన అమ్మాయిలు తిమ్మిరి గురించి మాట్లాడటం మాత్రమే విన్నానని ఆమె తెలిపింది. సమస్య గురించి మాట్లాడే ఈ సర్కిల్‌లను ఏర్పాటు చేయడం వల్ల సగం సమస్య వస్తుంది, కొన్నిసార్లు తిమ్మిరి రాని వారు కూడా మానసికంగా అనుభూతి చెందుతారు. పంజాబ్ ఇతర చిన్న నగరాల్లో చాలా మంది మహిళలు అలా చేయరు.. వారు మెనోపాజ్‌కు గురైనప్పుడు కూడా గ్రహించలేరు. అయితే ఇంటర్వ్యూలో భాగమైన టీనా తల్లి సునీత అహూజా కూడా కుమార్తెతో ఏకీభవించింది.

టీనా అహూజా తనకు ఎప్పుడూ వెన్నునొప్పి లేనందున నా శరీరత‌త్వం దేశీ అని కూడా పోలిక చెప్పింది. ఆడపిల్లలు మంచి ఆహారంపై దృష్టి సారించాలని, రాత్రి బాగా నిద్రపోవాలని, అంతా నార్మల్‌గా మారాలని ఆమె సలహా ఇచ్చారు. డైటింగ్ మానేయండి..మంచి నిద్రతో ప్రతిదీ సాధారణం అవుతుంది. చాలా మంది అమ్మాయిలు సోష‌ల్ మీడియాల‌కు బానిస‌వ్వ‌డం వంటి వాటితో లేని సమస్యలు వ‌చ్చిప‌డ‌తాయి.. అని కూడా తెలిపింది.

అయితే ఈ క్లిప్ పై రెడ్డిట్ లో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీనా ప్రకటనను ట్రోల్ చేసారు. వీడియోపై ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ``సాధారణంగా, స్త్రీలు ఇతర మహిళల జీవిత అనుభవాలను చెల్లుబాటు చేయకుండా త‌మ‌కు తెలిసిందే నిజ‌మ‌ని న‌మ్ముతారు. ప‌ర్స‌న‌ల్ స్టోరీలు చెబుతున్నారంటే.. అది పితృస్వామ్యం ఉత్పత్తి అని అర్థం. కానీ ఇక్కడ ఇది మూర్ఖత్వం తాలూకా ఉత్పత్తి.. అజ్ఞానం..అని విమ‌ర్శించారు. అవ‌స‌రం లేని స‌ల‌హాలు మానుకోవాల‌ని కూడా గోవిందా కుమార్తెకు సూచించారు. స్టార్ డాట‌ర్ టీనా సెల‌బ్రిటీ డాట‌ర్ కావ‌చ్చు... కానీ సినీప్ర‌పంచానికి సుప‌రిచితం కాదు. స‌ల‌హాలు సూచ‌న‌లు ఇంకా అవ‌స‌రం లేద‌ని ఒక‌రు కామెంట్ చేసారు.