Begin typing your search above and press return to search.

టిల్లు గాడిని భయపెడుతున్న రాకాసి జీవాలు!

అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీని రాకాసి జీవాలు భయపెడుతున్నాయి! అదేనండీ.. గాడ్జిల్లా × కాంగ్ సినిమా. ఈ హాలీవుడ్ చిత్రం కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   31 March 2024 6:04 AM GMT
టిల్లు గాడిని భయపెడుతున్న రాకాసి జీవాలు!
X

టిల్లు స్క్వేర్.. మంచి బజ్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన విషయం తెలిసిందే. వీటన్నింటికీ మించి మొదటి రోజు మంచి కలెక్షన్స్ అందుకుందీ సినిమా. రెండో రోజు కూడా పెద్ద ఎత్తున వసూళ్లను రాబట్టింది.

తొలి రోజు వరల్డ్ వైడ్‌ గా రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.5 కోట్లు వసూలు చేయగా.. నార్త్ అమెరికాలో సుమారుగా మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. నైజాం ఏరియాలో విడుదలైన తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా టిల్లు స్క్వేర్ ఘనత సాధించింది. టైర్ 2 హీరోలలో ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో దసరా, ఖుషీ మూవీలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీని రాకాసి జీవాలు భయపెడుతున్నాయి! అదేనండీ.. గాడ్జిల్లా × కాంగ్ సినిమా. ఈ హాలీవుడ్ చిత్రం కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇండియాలో రెండు రోజుల ముందే లక్షకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. త్రీడీ, ఐమ్యాక్స్, 4డీఎక్స్ తోపాటు అన్ని ఫార్మాట్లలో రిలీజ్ చేయడంతో పిల్లలు ఆసక్తిగా మూవీ చూస్తున్నారు. అన్ని భాషల్లో కూడా మేకర్స్ డబ్బింగ్ చేయడంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది.

గత 24 గంటల్లో ప్రముఖ టికెట్ సెల్లింగ్ బుక్ మై షో యాప్ లో చూసుకుంటే.. మన సిద్ధు టిల్లు స్క్వేర్ మూవీకి 268.61K టికెట్లు అమ్ముడవ్వగా.. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకు 240.41K టికెట్లు సేల్ అయ్యాయి. టిల్లు స్క్వేర్ కు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీనిస్తోందని సినీ పండితులు చెబుతున్నారు. యూత్ ఆడియెన్స్ టిల్లు వైపు ఉండగా మరోవైపు కిడ్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ హాలీవుడ్ మూవీ పై ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో లోకల్ అడ్డాలో టిల్లు రేంజ్ కలెక్షన్స్ దక్కకపోయినప్పటికి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మినిమమ్ పోటీని ఇస్తోంది అని చెప్పవచ్చు. వీకెండ్ లో రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆ తరువాత వచ్చే కలెక్షన్స్ బట్టి ఎవరి సత్తో ఏమిటో అర్ధమవుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్- ఆడు జీవితం కూడా మంచి టాక్ తో వెళ్తోంది. పృథ్వీరాజ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు.

అయితే టిల్లు స్క్వేర్ కు తెలుగు రాష్ట్రాల్లో రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌ లో రూ. 3 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో రూ. 11 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌ లో రూ. 3 కోట్లు.. ఇలా మొత్తంగా ఈ సినిమాకు రూ. 27 కోట్లు బిజినెస్ జరిగింది. మరి టిల్లు గాడు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలు కురిపిస్తాడో చూడాలి.