Begin typing your search above and press return to search.

'టిల్లు స్క్వేర్' ట్రైలర్: మనోడికి ఈసారి ఇంకా గట్టిగా తగిలేటట్లు ఉన్నది!

ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:34 PM GMT
టిల్లు స్క్వేర్ ట్రైలర్: మనోడికి ఈసారి ఇంకా గట్టిగా తగిలేటట్లు ఉన్నది!
X

టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఇది రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్‍ బాస్టర్ 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍. మాలిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్.. ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.


ఈరోజు (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ - మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసారు. దాదాపు మూడున్నర నిమిషాల ఈ వీడియో మరోసారి మన డీజే టిల్లు క్రేజీ రైడ్ ను చూడబోతున్నామని హామీ ఇస్తోంది. ట్రైలర్ లోకి వెళ్తే.. రాధికను లవ్ చేసి మోసపోయిన డీజే టిల్లుకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెడతారు. టిల్లు మాత్రం పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. బట్టలు చింపుకొని లవ్ చేసిన అమ్మాయి మోసం చేసి వెళ్లిపోయిందని తనకు మ్యాచింగ్ తీసుకొచ్చిన బంధువుల దగ్గర చెప్పుకొని వాపోయాడు.

మరోసారి ప్రేమలో పడే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసిన టిల్లు లైఫ్ లోకి అప్పుడే అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇస్తుంది. 'గుడ్ సెక్స్ అనేది గుడ్ ఫుడ్ లాంటిది' అంటూ అతనికి దగ్గరైంది. ఆమె రింగుల జుట్టుకు, మాటలకు పడిపోయిన టిల్లు.. మళ్ళీ లవ్ ట్రాక్ ఎక్కినట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా మనోడు ఆ అమ్మాయి సాడ్ స్టోరీ విని, ఆమె ప్రాబ్లమ్ ని తన ప్రాబ్లమ్ గా ఫీలయ్యి లేనిపోని సమస్యలను నెత్తికి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అయ్యాయి.

మొదటి భాగంలో మాదిరిగానే సిద్దు స్టైల్, స్వాగ్, అతని డైలాగ్ డైలీవరీ, యాటిట్యూడ్, హీరోయిన్ తో రొమాన్స్ వంటికి 'టిల్లు స్క్వేర్' లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనుపమా పరమేశ్వరన్ మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూవీలో గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ లుక్స్, రొమాంటిక్ సీన్స్ లో రాధికా పాత్రను మరిపించింది. ఇక ట్రయిలర్ లో సిద్దు - అనుపమ మధ్య దాదాపు 15 సెకన్ల పాటు ఉన్న ఈ ఘాడమైన లిప్ లాక్ చూసి ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

'బాంబూ చికెన్ తిందాం అని తీసుకుపోయి.. చికెన్ ఆమె తిని, బాంబూ నా నోట్లో పెట్టి వెళ్లిపోయింది అంతే' 'ఇట్ల నవ్వే మా బ్రతుకులను నవ్వులపాలు చేస్తరు' 'పోయినసారి కంటే ఈసారి నాకు ఇంకా దెబ్బ గట్టిగా తగిలేట్లు ఉన్నది' 'టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు.. నేనొక కారణజన్ముడ్ని. నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే.. ఈ ఊర్లో ఎన్ని పంచాయితీలు ఉన్నయో, ఎన్ని లేడీస్ పంచాయితీలు ఉన్నయో అవన్నీ నెత్తికి తెచ్చిపెట్టుకోవడం' అంటూ సిద్ధు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ గా 'టిల్లు స్క్వేర్' లో డబుల్ ఫన్, డబుల్ మ్యాడ్ నెస్ చూడబోతున్నామని అర్థమవుతోంది.

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.