Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. ఇది కదా సక్సెస్ అంటే

అలాంటిది ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు.

By:  Tupaki Desk   |   7 April 2024 5:48 PM GMT
టిల్లు స్క్వేర్.. ఇది కదా సక్సెస్ అంటే
X

టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ రోజు నిర్మాత నాగవంశీ.. ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తుంటే చాలామంది సోషల్ మీడియాలో కామెడీ చేశారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది, ఓపెనింగ్సూ వచ్చాయి. అంతమాత్రాన మరీ వంద కోట్ల వసూళ్లేంటి అన్నారు. కట్ చేస్తే ఈ సినిమా రెండో వీకెండ్ పూర్తి కాకముందే వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి ఔరా అనిపించింది. తొమ్మిది రోజుల్లోనే వరల్డ్ వైడ్ ‘టిల్లు స్క్వేర్’ వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. పారితోషకాలు పక్కన పెడితే.. ‘టిల్లు స్క్వేర్’ ప్రొడక్షన్ కాస్ట్ పది కోట్ల లోపే. అలాంటిది ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఏకంగా 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.

నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాల రేంజిలో ‘టిల్లు స్క్వేర్’కు వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఆల్రెడీ గ్రాస్ రూ.30 కోట్ల మార్కును దాటేసింది. ఫుల్ రన్లో ‘టిల్లు స్క్వేర్’ ఇక్కడ రూ.20 కోట్లకు పైగా షేర్ సాధించబోతోంది. వరల్డ్ వైడ్ ‘టిల్లు స్క్వేర్’ హక్కులు ఫ్యాన్సీ రేటుకు తీసుకున్న అందరూ తొలి వీకెండ్లోనే లాభాల బాట పట్టారు. దాదాపుగా పెట్టుబడి మీద రెట్టింపు షేర్ తెచ్చిపెట్టిందీ సినిమా. అంటే ఇది ఆల్రెడీ డబుల్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. రెండో వీకెండ్లో కూడా ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నాయి. ఈ వారం వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం, వచ్చే వారం కూడా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మినహా చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడం, ఇంకా చాలా రోజులు ‘టిల్లు స్క్వేర్’ హవా కొనసాగబోతోంది.