Begin typing your search above and press return to search.

టిల్లు దెబ్బకు సైడిచ్చిన పాత రికార్డులు

టిల్లు స్క్వేర్ సినిమా మొదటి వీకెండ్ లోనే అనుకున్న బాక్సాఫీస్ టార్గెట్ ను చాలా ఈజీ గానే ఫినిష్ చేసుకుంది

By:  Tupaki Desk   |   1 April 2024 2:14 PM GMT
టిల్లు దెబ్బకు సైడిచ్చిన పాత రికార్డులు
X

టిల్లు స్క్వేర్ సినిమా మొదటి వీకెండ్ లోనే అనుకున్న బాక్సాఫీస్ టార్గెట్ ను చాలా ఈజీ గానే ఫినిష్ చేసుకుంది. విడుదలకు ముందు కూడా ఈ సినిమాపై కొన్ని నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. చాలాసార్లు వాయిదా పడింది అని, రీషుట్లు కూడా జరిగాయి అని నెగిటివ్ కథనాలు వెలువడ్డాయి. కానీ మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గానే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ధీమాగా కనిపించారు.

ఇక మొత్తానికి సినిమా అనుకున్నట్లే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవటం విశేషం. ఇక ఈజీగా 100 కోట్ల టార్గెట్ ను ఈ వారంలోనే అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ లో మరికొన్ని పాత రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తూ ఉండడం విశేషం.

ముఖ్యంగా హీరో సిద్దు జొన్నలగడ్డ కెరియర్ కు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అతని టాలెంట్ తోనే టిల్లు స్క్వేర్ కు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో మీడియం రేంజ్ సినిమాల లిస్టులో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న బెస్ట్ సినిమాల్లో ఇది కూడా చోటు సంపాదించుకుంది. విడుదలైన మూడో రోజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందుకున్న కలెక్షన్స్ పాత రికార్డులను బ్రేక్ చేశాయి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడో రోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మీడియం రేంజ్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా టాప్ లో నిలవడం విశేషం. ఇక ఆ లిస్టు లోకి వెళితే ఉప్పెన సినిమా అత్యధికంగా 8.26 కోట్ల కలెక్షన్స్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ లిస్టులో దసరా సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా అలాగే లేటెస్ట్ సెన్సేషన్ మూవీ హనుమన్ కూడా ఉంది.

ఏపి తెలంగాణలో 3వ రోజు టాప్ కలెక్షన్లు అందుకున్న సినిమాలివే..

ఉప్పెన - 8.26 కోట్లు

టిల్లు స్క్వేర్ - 7.44

దసరా - 6.73 కోట్లు

విరుపాక్ష - 5.77 కోట్లు

హనుమాన్ - 5.70 కోట్లు

విజయ్ దేవరకొండ 'ఖుషి'- 5.68 కోట్లు

వీటన్నిటిని దాటి టైర్ 2 హీరోల మీడియం రేంజ్ సినిమాల జాబితాలో టిల్లు స్క్వేర్ కూడా టాప్ లిస్టులో రెండవ స్థానం సంపాదించుకోవడం విశేషం. చూస్తుంటే అత్యధిక వేగంగా 100 కోట్లు రాబట్టిన మీడియం రేంజ్ సినిమాల్లో ఇది కూడా టాప్ లిస్టులో చేరే అవకాశం కనిపిస్తోంది.