Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్… ఇలా చేస్తే రిస్కే బాబు

అందుకే మార్చి 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఏప్రిల్ 5న జూనియర్ ఎన్ఠీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:18 AM GMT
టిల్లు స్క్వేర్… ఇలా చేస్తే రిస్కే బాబు
X

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. రామ్ మిరియాల ఈ చిత్రంతో సంగీత దర్శకుఢుగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

డీజే టిల్లు ఫీల్ కి క్యారీ చేస్తూ ఈ సాంగ్స్ రెండు ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఎన్నడూ లేనంత రొమాంటిక్ గా నటిస్తూ ఉండటం విశేషం. రౌడీబాయ్స్ సినిమాలో అనుపమని రొమాంటిక్ యాంగిల్ లో చూసిన ఆడియన్స్ కి టిల్లు స్క్వేర్ లో అంతకు మించి ఎంటెర్టైన్ ని మల్లు బ్యూటీ అందించబోతోంది.

ఇప్పటికే పోస్టర్స్ తో కిక్ ఇచ్చేస్తోంది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావించింది. అయితే సంక్రాంతి నుంచి ఈగల్ తప్పుకోవడంతో సితార ఆ డేట్ ని వారికి ఇచ్చేశారు. దీంతో టిల్లు స్క్వేర్ వెనక్కి వెళ్ళింది. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. కొన్ని సీక్వెన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయంట.

అందుకే మార్చి 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఏప్రిల్ 5న జూనియర్ ఎన్ఠీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ 10 రోజుల ముందుగానే స్టార్ట్ అవుతుంది.

సోషల్ మీడియాలో బజ్ మొత్తం దేవర మీదనే ఉంటుంది. దానిని తట్టుకొని టిల్లు స్క్వేర్ మూవీకి ఆడియన్స్ ని ఏ మేరకు రప్పించగలడు అనేది సందేహాస్పదంగా మారింది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న మూవీ అయిన కూడా కచ్చితంగా ముందుగానే స్ట్రాంగ్ ప్రమోషన్స్ ఉండాలి. కానీ ఈ సినిమాకి దేవర బజ్ మధ్యలో ఆ స్థాయిలో ప్రమోషన్ దొరుకుతుందా అనేది చెప్పలేం. ఒక వేళ వాయిదా వేస్తే శంకర్ ఇండియన్ 2 లైన్ లో ఉంది. మరి ఈ టఫ్ సిచువేషన్ ని సితార వారు ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి.