Begin typing your search above and press return to search.

టిల్లూ..ఎక్క‌డో తేడాకొడుతోందా?..అందుకేనా ఈ ప‌రేషాన్?

కీల‌క స‌న్నివేశాల విష‌యంలో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ చాలా వ‌ర‌కు అసంతృప్తిగా ఉండ‌ట‌మేన‌ట‌. దీంతో కొన్ని సీన్‌లు మ‌ళ్లీ రీ షూట్ చేయాలని సిద్దూ ఆలోచిస్తున్నాడ‌ట‌.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:29 AM GMT
టిల్లూ..ఎక్క‌డో తేడాకొడుతోందా?..అందుకేనా ఈ ప‌రేషాన్?
X

బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్ అంటే ఉండే అంచ‌నాలు వేరు. అంత‌కు మించి అనే స్థాయిలో ప్రేక్ష‌కులు ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్థాయిలో లేదంటే నిర్మొహ‌మాటంగా పెద‌వి విరిచేస్తుంటారు. దీంతో సీక్వెల్ విష‌యంలో మేక‌ర్స్‌తో పాటు హీరోలు కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటూ ఎక్క‌డా త‌గ్గ‌కుండా జాగ్గ‌త్త‌ప‌డుతుంటారు. అనుకున్న విధంగా సినిమా రాలేదంటే ప‌రేషాన్ అవుతుంటారు. ఇప్పుడు ఇదే ఫీలింగ్‌తో మ‌న టిల్లూ సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ ప‌రేషాన్ అవుతున్నాడని ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

గ‌త ఏడాది `డీజే టిల్లు` సినిమాతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా టిల్లూ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయిలో ఇమేజ్‌ని సొతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌గా `టిల్లు స్క్వేర్‌` చేస్తున్నాడు. మొద‌టి భాగానికి భిన్నంగా..మ‌రింత భారీ స్థాయిలో ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. `డీజే టిల్లు` బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో సిద్దూపై ఉన్న న‌మ్మ‌కంతో అత‌ని మార్కుట్‌ను మించి ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ సినిమాని సిద్దూ ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ చేత చెక్కిస్తూనే ఉన్నాడు.

బ‌డ్జెట్ పెరిగినా, హీరోయిన్‌ని మార్చి భారీ పారితోషికం అందించి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని రంగంలోకి దించినా ఈ సినిమా షూటింగ్ ఇంకా జ‌రుగుతూనే ఉంది. అక్టోబ‌ర్‌లో రిలీజ్ అనుకుంటున్నా.. రావ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. కార‌ణం రీ షూట్‌లు చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా `డీజే టిల్లు` టైటిల్ సాంగ్ రేంజ్‌లో `టిల్లూ స్క్వేర్‌` సాంగ్ పాపుల‌ర్ కాక‌పోవ‌డం, కీల‌క స‌న్నివేశాల విష‌యంలో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ చాలా వ‌ర‌కు అసంతృప్తిగా ఉండ‌ట‌మేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని సీన్‌లు మ‌ళ్లీ రీ షూట్ చేయాలని సిద్దూ ఆలోచిస్తున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇప్ప‌టికే బ‌డ్జెట్ పెరిగిపోయింది. ఈ ద‌శ‌లో మ‌ళ్లీ రీ షూట్ అంటే ఎలా అనే టాక్ వినిపిస్తోంది. కానీ సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ మాత్రం సినిమా ఔట్ పుట్ విష‌యంలో చాలా ప‌రేషాన్ అవుతున్నాడ‌ని. ఎట్టిప‌రిస్థితుల్లో `డీజే టిల్లు`తో క్రియేట్ చేసిన బ్రాండ్‌ని దెబ్బ‌తీయొద్ద‌ని, దానికి మించిన స్థాయిలో `టిల్లూ స్క్వేర్‌` ఉండాల‌ని, ఇందు కోసం రీ షూట్‌లు అవ‌స‌రం అయితే ఎట్టిప‌రిస్థితుల్లోనూ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. సిద్దూ ఈ సినిమాకు హీరో కం రైట‌ర్ కావ‌డంతో మేక‌ర్స్‌తో పాటు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ కూడా ఎదురు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని ఇన్ సైడ్ టాక్‌.