Begin typing your search above and press return to search.

పవర్ఫుల్ టిల్లు .. మూడో కథలో రిస్క్ ఎక్కువే..?

సిద్ధు ప్లాన్ తెలుసుకున్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 1:30 PM GMT
పవర్ఫుల్ టిల్లు .. మూడో కథలో రిస్క్ ఎక్కువే..?
X

డీజే టిల్లు.. టిల్లు స్క్వేర్.. టిల్లు క్యూబ్.. ఇలా టిల్లు ఫ్రాంచైజీ టాలీవుడ్ లో దూసుకుపోతోంది! స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లో రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి.. రూ.100 కోట్ల దిశగా వెళుతోంది. ఇప్పటికే రూ.15 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా.. డీజే టిల్లు సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ క్యారెక్టర్ సినీ ప్రియులకు బాగా నచ్చేసింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కు కూడా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో ఇదే ఊపులో టిల్లు క్యూబ్‌ ను కూడా ప్రకటించేశారు మేకర్స్. ఇక సీక్వెల్ పై నెట్టింట జోరుగా చర్చ సాగుతున్న వేళ.. టిల్లు క్యూబ్ మూవీపై ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సిద్ధు.

టిల్లు ఫ్రాంచైజీలో డైనమిక్ మార్పులు చేయాలనుకుంటున్నట్లు సిద్ధు తెలిపారు. "డీజే టిల్లు సినిమా ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ కథ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌ కూడా అదే పాయింట్‌ తో వచ్చింది. కానీ ఈ సారి టిల్లు క్యూబ్‌ లో టిల్లుకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? అనే పాయింట్ మీద స్టోరీ అంతా నడుస్తుంది" అని సిద్ధూ తెలిపారు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని అప్డేట్ కూడా ఇచ్చారు.

సిద్ధు ప్లాన్ తెలుసుకున్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు మంచి కామెడీ పంచిన టిల్లు.. ఇప్పుడు సూపర్ హీరోగా రావడం వెనుక కారణమేంటి అని అంటున్నారు. ఇటీవల సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇది మంచి టర్న్ అంటూ సిద్ధు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ హీరోగా కూడా కామెడీ పండిస్తారేమోనని అంటున్నారు. ఐడియా బాగానే ఉన్నా.. కాస్త రిస్క్ ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఒకే పాయింట్ తో సీక్వెల్స్ చేస్తే ఆడియన్స్ విసుగు చెందే అవకాశం ఉందని, హైప్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు సినీ పండితులు. సిద్ధు సూపర్ హీరో ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలని అంటున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. రెండో భాగంలో అనుపమ ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. మరి టిల్లు క్యూబ్ లో సిద్ధు జొన్నలగడ్డ సరసన ఎవరు నటిస్తారో చూడాలి.