Begin typing your search above and press return to search.

'టిల్లు స్క్వేర్'.. పంచులే పంచులు!

ఒక డైలాగ్ కు నవ్వే లోపు, ఇంకో పంచ్ డైలాగ్ పేలుస్తూ.. సినిమా అంతా ఇలా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి సిద్దూ అండ్ టీమ్ పడిన కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే.

By:  Tupaki Desk   |   29 March 2024 4:07 PM GMT
టిల్లు స్క్వేర్.. పంచులే పంచులు!
X

టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ ఇది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. గతేడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా.. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తోంది.

ఫస్ట్ పార్ట్ లో టిల్లు క్యారక్టరైజేషన్ జనాలకు ఎంత బాగా రీచ్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని స్వాగ్, స్టైల్, విలక్షణమైన డైలాగ్ డెలివెరీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి కల్ట్ క్యారక్టర్ తో, 'డీజే టిల్లు' కథకు కొనసాగింపుగా వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా టార్గెట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. మొదటి భాగంలో మాదిరిగానే కథ మామూలుగానే అనిపించినా, డబుల్ ఫన్ & డబుల్ మ్యాడ్ నెస్ తో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ను అందించడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యారు.

ముఖ్యంగా డీజే టిల్లు పాత్రతో చెప్పించిన వన్ లైనర్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. సిద్ధు టిపికల్ డైలాగ్ గెలివరీతో సాగే ఈ సంభాషణలే ఎంటర్టైన్మెంట్ డోస్ ను రెట్టింపు చేశాయి. సింపుల్‌గా అనిపిస్తూనే, కావల్సినంత ఫన్ జనరేట్ చేసే డైలాగులు ఈ సినిమాలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక డైలాగ్ కు నవ్వే లోపు, ఇంకో పంచ్ డైలాగ్ పేలుస్తూ.. సినిమా అంతా ఇలా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి సిద్దూ అండ్ టీమ్ పడిన కష్టాన్ని మెచ్చుకోవాల్సిందే.

ఉదాహరణగా కొన్ని డైలాగ్స్ చెప్పుకుంటే.. టిల్లు తండ్రి పైల్స్ కంప్లైంట్ తో డాక్టర్ని కలిసిన సందర్భంలో ''మైదా పిండి మధ్యలో నీ పేగులున్నాయా?.. పేగుల మధ్య మైదాపిండి ఉందా?.. ఒక పైప్ పెట్టి లోపల నీ మైదా ఉద్యమాన్ని 4కేలో చూపిస్తారు'' అని అనడం విపరీతంగా నవ్వు తెప్పిస్తుంది. అలానే మరో సందర్భంలో వంశం గురించి మాట్లాడుతున్న తండ్రితో ''పెన్షన్ కోసం ఫేక్ సర్టిఫికెట్ రెడీ చేయించిన నువ్వా వంశం గురించి మాట్లాడుతున్నావ్'' అంటూ పంచ్ ఇస్తాడు టిల్లు.

రాధికగా రీఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి తనని మొక్కుబడిగా కుశల ప్రశ్నలు అడుగుతుంటే.. "ఎయిర్ హోస్టెస్, కాల్ సెంటర్ అమ్మాయి లాగా బేసిక్ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అడక్కు ప్లీజ్" అనడం.. "అందంగా ఉందని గోకొద్దు. అమాంతం మింగేసి అస్థిపంజరం బయటికి తీస్తది", "నల్లచీర.. ఎ ఫిల్మ్ బై రాధిక. చాలా పెద్ద డైరెక్టర్. కథలు మస్తు చెప్తది" అంటూ రాధిక క్యారక్టర్ గురించి చెప్పిన డైలాగ్స్ థియేటర్ లో బాగా పేలాయి.

''ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుతున్నారో కానీ.. నన్ను మాత్రం ప్రతిసారీ ఇంపాక్ట్ ప్లేయర్ గా దించుతున్నారు''.. ''ఈ హరాస్మెంట్ నేను భరించలేకున్నాను.. అర్జెంటుగా సిక్ లీవ్ అప్లై చెయ్యాలి. దయచేసి అప్రూవ్ చెయ్''.. "అమ్మ అస్మంటి అమ్మాయిలు లేరు బయట.. అమ్మేసే అమ్మాయిలున్నారు".. "నా నొప్పి దాచుకోవడానికి నేను నవ్వుతున్నాను.. నీ తప్పు దాచుకోవడానికి నువ్వు ఏడుస్తున్నావ్" లాంటి వన్ లైనర్స్ సిద్ధు టైమింగులో వినడానికి చాలా బాగున్నాయి.

ఇలా పంచ్ డైలాగులతో, వన్ లైనర్స్ తో 'టిల్లు స్క్వేర్' రెండు గంటల పాటు నవ్విస్తూనే ఉంది. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లుకు మించి ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. మామూలుగా ఉండే సన్నివేశాలను కూడా తన టిపికల్ డైలాగ్స్ తో హైలైట్ అయ్యేలా చేశాడు. కథ గురించి పట్టించుకోకుండా, ప్రేక్షకులు సినిమా అంతా ఎంజాయ్ చేసేలా సినిమా నడిపించారు. సమ్మర్ కు సరైన వినోదాన్ని తీసుకొచ్చిన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.