Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. నిర్మాత స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది!

కానీ నాగ వంశీ మాత్రం ''టిల్లు స్క్వేర్'' సినిమా విడుదలకు ముందు ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ షోలు, నైట్ షోలు వెయ్యలేదు.

By:  Tupaki Desk   |   29 March 2024 4:30 PM GMT
టిల్లు స్క్వేర్.. నిర్మాత స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది!
X

ఇటీవల కాలంలో సినిమా రిలీజ్ కు ముందే స్పెషల్ 'ప్రీమియర్ షోలు' వెయ్యడం ట్రెండ్ గా మారింది. ఒకరోజు ముందుగానో లేదా అర్థరాత్రిల్లోనో పెయిడ్ ప్రీమియర్స్ వేసి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇది కొన్ని సినిమాలకు బాగా కలిసొస్తే, మరికొన్ని చిత్రాలకు ప్రతికూలంగా మారుతోంది. సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' సినిమాకు నైట్ షోలు వేయడం నెగిటివ్ టాక్ రావడానికి కారణమైందని నిర్మాత నాగవంశీ చెప్పడం మనం చూశాం. అందుకేనేమో ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' చిత్రానికి ప్రీమియర్ షోలు వెయ్యలేదనే అనే టాక్ వినిపిస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ''టిల్లు స్క్వేర్''. 'డీజే టిల్లు' కు సీక్వెల్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ఈరోజు శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. మార్నింగ్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉండటంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత నాగ వంశీ అయితే ఈ సినిమా ఫస్ట్ డే రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

నిజానికి కంటెంట్ ని చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తుంటారు. కానీ నాగ వంశీ మాత్రం ''టిల్లు స్క్వేర్'' సినిమా విడుదలకు ముందు ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ షోలు, నైట్ షోలు వెయ్యలేదు. సినీ ప్రముఖులకు, మీడియా వారికి కూడా ప్రత్యేక షోలు ప్రదర్శించలేదు. 'గుంటూరు కారం' సినిమా విషయంలో అర్థరాత్రి షోల నుంచే ఎదురుదెబ్బ తగిలిందని, ఆ షోలు వేసి తప్పు చేశామని నిర్మాత భావించారు. అందుకే ఇప్పుడు ప్రీమియర్ షోల ట్రెండ్ ను ఫాలో అవ్వలేదని అనుకుంటున్నారు.

'గుంటూరు కారం' సినిమా సెకండ్ వీక్ లోకి ఎంటరైన తర్వాత ప్రొడ్యూసర్ నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మొదటిరోజు నెగటివ్ టాక్ రావడానికి కారణం ఏంటో వివరించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పడిన షోస్ కారణంగానే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యిందని అన్నారు. నైట్ షోలు వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయ పడ్డారు. ఆ పాఠాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కు ప్రీమియర్ షోలు ప్రదర్శించకుండా.. రిలీజ్ రోజే ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారని అనుకోవచ్చు.

ఏదేమైనా 'టిల్లు స్క్వేర్' సినిమాలు తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్ వచ్చింది. టిల్లు క్యారెక్టరైజేషన్, కామెడీ, యూత్ ని అలరించే డైలాగ్స్, అనుపమ అందాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రీమియర్ షోలు వేస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ, నాగ వంశీ ఈ చిత్రాన్ని సరిగ్గా థియేటర్లలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ మూవీకి యుఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. నైజాంలో 7 - 8 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ఇది కచ్ఛితంగా 100 కోట్ల సినిమా అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.