Begin typing your search above and press return to search.

డీజే సౌండ్ మళ్లీ ఇంత త్వరగానా..!

డీజే టిల్లు సినిమా సూపర్ హిట్‌ అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్‌ ను చేశాడు

By:  Tupaki Desk   |   19 April 2024 8:21 AM GMT
డీజే సౌండ్ మళ్లీ ఇంత త్వరగానా..!
X

డీజే టిల్లు సినిమా సూపర్ హిట్‌ అవ్వడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో సిద్దు జొన్నలగడ్డ సీక్వెల్‌ ను చేశాడు. టిల్లు స్క్వేర్ అంటూ వచ్చిన ఈ సీక్వెల్ కి కూడా హిట్ టాక్‌ దక్కింది. మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండో పార్ట్‌ కి దాదాపు రెట్టింపు వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

నాలుగు వారాలు కూడా పూర్తి అవ్వకుండానే టిల్లు స్క్వేర్ సినిమా రూ.125 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు, హిట్‌ టాక్ రావడంతో ఇంకా మంచి వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు టిల్లు స్క్వేర్‌ సినిమా స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యారు. ఏప్రిల్‌ 26న ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

సాధారణంగా హిట్‌ సినిమాలు కనీసం 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు వస్తున్నాయి. కానీ టిల్లు గాడి డీజే సౌండ్‌ మాత్రం మరీ ఇంత త్వరగా ఓటీటీ లో మళ్లీ వినిపిస్తుందని అనుకోలేదు. నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిన టిల్లు స్క్వేర్‌ కచ్చితంగా మళ్లీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.

సిద్దు జొన్నలగడ్డకు జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో రూపొందిన టిల్లు స్క్వేర్‌ సినిమా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది. ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత మరింతగా ఈ సినిమా గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. టిల్లు 2 కూడా హిట్‌ అవ్వడంతో మూడో పార్ట్‌ ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.