Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. నిర్మాత సేఫ్ అయినట్లే..

ఈ మూవీ హిట్ అయితే దీనికి సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టిల్లు క్యారెక్టర్ కి అయితే యూత్ ఫ్యాన్స్ గా మారిపోయారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 3:57 AM GMT
టిల్లు స్క్వేర్.. నిర్మాత సేఫ్ అయినట్లే..
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ మార్చిలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. టిల్లు అనే పేరు ఈ సినిమాకి కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది. దానికి తోడు సాంగ్స్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మూవీ మీద విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ అయితే టిల్లు స్క్వేర్ పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది.

అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అలాగే టిల్లు క్యారెక్టర్ కి కూడా విపరీతంగా అడిక్ట్ అయిపోయారు. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అనే నిర్ణయానికి ఆడియన్స్ వచ్చేశారు. ఆ స్థాయిలో మూవీపైన పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలకి కూడా కావాల్సింది ఇలాంటి పాజిటివ్ బజ్ ఉన్న సినిమాలే.

అందుకే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఛానల్స్ రికార్డ్ ధరకి కొనుగోలు చేసింది. మూవీ డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 35 కోట్లు చెల్లించిందంట. అంటే ఈ సినిమా మెజారిటీ బడ్జెట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ద్వారానే నిర్మాత నాగవంశీకి వచ్చేశాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు.

సిద్దు జొన్నలగడ్డ ఈ చిత్రానికి కథ సమకూర్చడం విశేషం. యూత్ కి ఎలాంటి కంటెంట్ కావాలనేది సిద్దు జొన్నలగడ్డ కరెక్ట్ గా పట్టుకొని టిల్లు స్క్వేర్ మూవీ చేసాడని అర్ధం అవుతోంది. ఈ మూవీ హిట్ అయితే దీనికి సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టిల్లు క్యారెక్టర్ కి అయితే యూత్ ఫ్యాన్స్ గా మారిపోయారు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక మూవీ చేస్తున్నాడు.

నీరజ కోన దర్శకురాలిగా ఈ చిత్రంతో పరిచయం అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక మూవీ సెట్స్ పైన ఉంది. ఈ రెండు సినిమాలు కూడా యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ గానే తెరకెక్కుతూ ఉండటం విశేషం. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అయితే ఆ బజ్ ఈ రెండు చిత్రాలకి కూడా కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.