Begin typing your search above and press return to search.

టిల్లు గాడు ఈ గండం గట్టెక్కితే..

అయితే ఈసారి టిల్లు మ్యాజిక్ అంతగా కనిపించకపోవచ్చు అనేలా కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి

By:  Tupaki Desk   |   1 April 2024 11:54 AM GMT
టిల్లు గాడు ఈ గండం గట్టెక్కితే..
X

సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ క్యారెక్టర్ బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా క్లిక్ కాలేదు. వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందుకుని మొత్తానికి అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసింది. మొదట ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్లో గానే మొదలయ్యాయి. రెండు మూడు సార్లు వాయిదాలు పడ్డప్పటికీ మేకర్స్ మాత్రం కాన్ఫిడెంట్ గానే కనిపించారు. అయితే ఈసారి టిల్లు మ్యాజిక్ అంతగా కనిపించకపోవచ్చు అనేలా కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి.

అయితే వాటికి కౌంటర్ గా హీరో సిద్దు తన టాలెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందించాడు. ఇక మొత్తానికి టిల్లు స్క్వేర్ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించి ఇప్పుడు మంచి లాభాలను అందిస్తోంది. అయితే నిర్మాత నమ్మకం ప్రకారం ఈ సినిమా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ టార్గెట్ ను కూడా ఈ వారంలోనే రీచ్ అయ్యే అవకాశం ఉంది.

మొదటి మూడు రోజులు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. 60 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రావడంతో పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చాయి. అయితే సోమవారం నుంచి అసలు గండం స్టార్ట్ అవుతుంది. వర్కింగ్ డే కాబట్టి ఓవైపు పరీక్షల కాలం మరొకవైపు బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమా కూడా పోటీగా ఉంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సినిమా కూడా కలెక్షన్స్ బాగానే రాబడుతోంది.

అయితే టిల్లు వన్ సైడ్ ఫ్యాన్స్ జోష్ తో సోమవారం అడ్వాన్స్ బుకింగ్ బాగానే నమోదయ్యాయి. వీకెండ్ టాక్ ఇప్పుడు పని చేయాల్సిన టైమొచ్చింది. సోమవారం కలెక్షన్స్ స్టడీగా ఉంటేనే మిగతా వర్కింగ్ డేస్ పై ఒక అంచనాకు రావచ్చు. ఈ గండం తట్టుకొని గురువారం వరకు సినిమా మరింత ఎక్కువ కలెక్షన్స్ అందుకోవాల్సి అవసరం ఉంది.

ఇక మళ్లీ ఈవారమే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో బాక్సాఫీస్ వద్ద రంగంలోకి దిగుతున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ తోనే హడావిడి బాగా క్రియేట్ చేశారు. కాబట్టి టిల్లుకి సెకండ్ వీకెండ్ స్ట్రాంగ్ గా ఉండడం అంత ఈజీ కాదు. ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. సమ్మర్ హాలిడేస్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ అటువైపు యూ టర్న్ తీసుకుంటే టిల్లు స్క్వేర్ సినిమా ఎక్కువ కాలం నిలకడగా ఉండడం కష్టమే.

కాబట్టి ఈ గురువారం వరకు టిల్లు వీలైనంత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగూ 100 కోట్ల కలెక్షన్స్ అయితే వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న టాక్ ను బట్టి సినిమా ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి రెండో వారం ఈ కఠినమైన పోటీని ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.