Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. అది క్లిక్కయితే పెద్ద ప్రమాదమే..

ఈ కారణంగా యూత్ ఆడియన్స్ లో టిల్లు స్క్వేర్ పై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. రామ్ మిరియాల ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   25 March 2024 5:57 AM GMT
టిల్లు స్క్వేర్.. అది క్లిక్కయితే పెద్ద ప్రమాదమే..
X

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 29న రిలీజ్ కానుంది. DJ టిల్లు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలవడంతో ఈ సీక్వెల్ కథకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఎంటెర్టైన్ చేయబోతోంది.

ఈ కారణంగా యూత్ ఆడియన్స్ లో టిల్లు స్క్వేర్ పై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. రామ్ మిరియాల ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోయే ఈ సినిమాకి హాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. హాలీవుడ్ లో గాడ్జిల్లా కాంగ్ 2 మూవీ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

గాడ్జిల్లా కాంగ్ మొదటి పార్ట్ కరోనా కాలంలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అక్కడ డిజిటల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో ఈ చిత్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా భారీ స్క్రీన్స్ లో గాడ్జిల్లా కాంగ్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రాలకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఆదరణ ఉంటుంది.

ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో హాలీవుడ్ సినిమాలకి విశేషమైన స్పందన లభిస్తూ ఉంటుంది. అవతార్ 2 ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఇండియాలో 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఓపెన్ హైమర్ కి కూడా ఇండియాలో మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీకి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ గాడ్జిల్లా కాంగ్ 2 సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే బీ,సి సెంటర్స్ లో టిల్లు స్క్వేర్ హవాని ఎవరూ నియంత్రించలేరని అంచనా వేస్తున్నారు. మూవీపై పాజిటివ్ బజ్ ఉండటంతో కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. ఈ మూవీ హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్, మార్కెట్ రేంజ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.