Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్ సందడి లేదేంటి..?

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఆ సినిమా నుంచి అతని గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది

By:  Tupaki Desk   |   30 Sep 2023 11:30 AM GMT
టిల్లు స్క్వేర్ సందడి లేదేంటి..?
X

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఆ సినిమా నుంచి అతని గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. డీజే టిల్లు తర్వాత ఆ సినిమానే సీక్వెల్ చేస్తూ టిల్లు స్క్వేర్ ని అనౌన్స్ చేశారు. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవగా టిల్లు స్క్వేర్ మాత్రం భారీ అంచనాలతో రాబోతుంది. అంతేకాదు సినిమాకు బడ్జెట్ కూడా బాగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమా అసలైతే ఆగష్టు 11న రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో కూడా ఒక రిలీజ్ డేట్ వేశారు.

ఫైనల్ గా అక్టోబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన ఒక టీజర్. ఆ తర్వాత ఒక సాంగ్ తప్ప మళ్లీ సందడి లేదు. అక్టోబర్ 6న రిలీజ్ అవ్వాల్సిన సినిమా చేయాల్సిన హడావిడి ఏది కనిపించలేదు. సినిమా అక్టోబర్ 6న వస్తుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది.

సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఎప్పుడు వచ్చినా సరే మళ్లీ డీజే టిల్లు కి మించి సినిమా హిట్ కొడతాం అంటున్నాడు. సిద్ధు కాన్ఫిడెన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా అనుపమ ఈ సినిమాలో ఫుల్ గ్లామర్ షో చేసిందని టాక్. డీజే టిల్లులో రాధిక పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో తెలిసిందే. టిల్లు స్క్వేర్ లో రాధికని మించి అనుపమ రోల్ ఉంటుందని అంటున్నారు.

రిలీజ్ వారం రోజులు ఉన్న సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. టిల్లు స్క్వేర్ రిలీజ్ వాయిదా పడిందా కొత్త రిలీజ్ డేట్ ఏంటి. సినిమా ఇంకా ఎన్నాళ్లు రిలీజ్ చేయకుండా ఆపుతారు లాంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఏది ఏమైనా సిద్ధు జొన్నలగడ్డ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టిల్లు సినిమాపై ఈ కన్ ఫ్యూజన్ ఆడియన్స్ లో సినిమాపై ఉన్న అటెన్షన్ ని పోగొట్టేలా చేస్తుంది. మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాకు కథ స్క్రీన్ ప్లే సిద్ధునే అందిస్తున్నాడని తెలిసిందే. డీజే టిల్లుకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరి టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.