Begin typing your search above and press return to search.

టిల్లుకు రిపేర్లు జరుగుతున్నాయా ఏంటి?

హీరోగా ఆయన ఈ సినిమా లో నటించడం మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని తానే చూసుకుంటూ ఉన్నాడు

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:58 AM GMT
టిల్లుకు రిపేర్లు జరుగుతున్నాయా ఏంటి?
X

సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా దక్కించుకున్న భారీ విజయం నేపథ్యం లో అంతే స్థాయి లో టిల్లు స్వౌర్ సినిమాను రూపొందించేందుకు గాను సిద్దు రెడీ అయ్యాడు. మొదటి పార్ట్‌ తో పోల్చితే సీక్వెల్‌ అంతకు మించి ఉంటుందని సన్నిహితుల వద్ద సిద్దు చెప్పుకొచ్చాడు.

గత ఏడాదిలోనే ప్రారంభం అయిన ఈ సీక్వెల్ సినిమా ను ఈనెల 15వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ సినిమా ఈ వారంలో విడుదల అవ్వడం లేదు. విడుదల వాయిదా పడటానికి కారణం ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అసలు విషయం ఏంటంటే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు రీ షూట్‌ చేస్తున్నారట.

రీ షూట్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అంటున్నారు. సిద్దు కి కొన్ని సన్నివేశాలు సంతృప్తిని ఇవ్వక పోవడంతో హీరోయిన్ డేట్లు తీసుకుని మళ్లీ షూటింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటి వరకు షూటింగ్ ముగియనుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది లో టిల్లు స్వౌర్ సినిమా వచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు సిద్దు జొన్నలగడ్డ ఈ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. హీరోగా ఆయన ఈ సినిమా లో నటించడం మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని తానే చూసుకుంటూ ఉన్నాడు. కనుక సినిమాలోని ఆ సన్నివేశాల రీ షూట్ నిర్ణయం సిద్దు దే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.