Begin typing your search above and press return to search.

టిల్లు అన్న ఇలా అయితే ఎలా అన్నా..?

డీజే టిల్లు ఈ సినిమా ఎంతలా క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీకి పెద్దవారే కాదు, చిన్నపిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు

By:  Tupaki Desk   |   5 Sep 2023 8:18 AM GMT
టిల్లు అన్న ఇలా అయితే ఎలా అన్నా..?
X

డీజే టిల్లు ఈ సినిమా ఎంతలా క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీకి పెద్దవారే కాదు, చిన్నపిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక, ఈ మూవీ సీక్వెన్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈ సెకండ్ పార్ట్ లో అనుపమ హీరోయిన్ కావడంతో మరింత హైప్ పెరిగింది. ఇటీవల కొన్ని పాటలు విడుదల చేయగా, అది చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి.

కానీ, ఈ మూవీ మాత్రం విడుదల ఆలస్యమౌతూ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ చాలా సార్లు విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు. ప్రతిసారీ వాయిదా అవుతూ వచ్చింది. సెప్టెంబర్ లో విడుదల పక్కా అనుకున్నారు. కానీ, ఈసారి కూడా వాయిదా పడింది. అయితే, మూవీ టీమ్ విడుదల విషయంలో తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది. సారీ అంటూ విడుదల చేయడం లేదు అనేది వారి ప్రకటన సారాంశం.

ఆలస్యమైనా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వారు చెప్పడం విశేషం. అయితే, ఈ మూవీ వాయిదా పడింది అనే విషయం దాదాపు అందరికీ తెలిసిపోయింది. సెప్టెంబర్ 15న మూవీ అంటే, ఈ పాటికి ప్రమోషన్స్ హీట్ పెంచేవారు, కనీసం ట్రైలర్ అయినా విడుదల చేయాల్సి ఉంది. కానీ, అది కూడా చేయలేదు. దానిని పట్టే ఈ మూవీ ఇప్పుడు రావడం లేదనే విషయంలో క్లారిటీ వచ్చింది.

ఆ తేదీన ఇప్పటికే స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ లు విడుదలవ్వడానికి రెడీ అయ్యాయి. అంతేకాదు, ఈ మూవీ లు ఇప్పటికే ట్రైలర్లు కూడా విడుదల చేశారు. ప్రమోషన్స్ కూడా హీట్ పెంచేశాయి. అవి జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. టిల్లు స్క్వేర్ రావడం లేదు అనే విషయం అందరికీ అర్థమయ్యాక, ఇప్పుడు ఆలస్యంగా సారీ అంటూ చెప్పడం ఏంటి టిల్లూ బ్రో అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

ఇక, మొదటి భాగం లో సిద్దు జొన్నల గడ్డ చెప్పిన డైలాగుల తో పాటు, నేహా శెట్టి అందాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. మూవీ విజయం సాధించడానికే ఇవే కారణం. మరి రెండో భాగంలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.