Begin typing your search above and press return to search.

టిల్లు గాడి బిజినెస్ బాగుంది.. ముందే టేబుల్ ప్రాఫిట్!

సిద్దు జొన్నలగడ్డ మరో సెంటిమెంట్ సక్సెస్ అందుకోవడానికి టిల్లు స్క్వేర్ సినిమాతో రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   23 March 2024 4:49 AM GMT
టిల్లు గాడి బిజినెస్ బాగుంది.. ముందే టేబుల్ ప్రాఫిట్!
X

సిద్దు జొన్నలగడ్డ మరో సెంటిమెంట్ సక్సెస్ అందుకోవడానికి టిల్లు స్క్వేర్ సినిమాతో రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో లిల్లీ పాత్రలో నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ మూవీలో చాలా బోల్డ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు అనుపమ చేయనటువంటి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రంలో చేసింది.

టిల్లు స్క్వేర్ లో క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటనేది కూడా అనుపమ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్ మూవీ సీక్వెల్ కావడంతో టిల్లు స్క్వేర్ పైన హైప్ క్రియేట్ అయ్యి ఉంది. మూవీ కంటెంట్ కూడా యూత్ కి కనెక్ట్అయ్యేలా ఉందనే అభిప్రాయం టీజర్ చూసిన తర్వాత వస్తోంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ మూవీ పై సాలిడ్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ ఆంధ్రా రైట్స్ 12 కోట్ల రేషియోతో అమ్ముడయ్యాయి. అలాగే సీడెడ్ హక్కులు 3 కోట్ల రేషియోకి సోల్డ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై 32 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 30 కోట్లకి కొనుగోలు చేసింది. ఓవరాల్ గా 60 కోట్ల వ్యాపారం టిల్లు స్క్వేర్ మీద జరిగింది. అంటే సాలిడ్ టేబుల్ ప్రాఫిట్ తోనే సితారా, ఫార్ట్యూన్ ఫోర్ వారు ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

డిజిటల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ షేర్ తిరిగి వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 29న మూవీ గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. డీజే టిల్లు అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే టిల్లు స్క్వేర్ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రమోషన్స్ చేసి సోలో డేట్ సెలెక్ట్ చేసుకోవాలని ఇంత కాలం ఆగారు. మరి ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని టిల్లు ఎంత వరకు రీచ్ అవుతాడనేది వేచి చూడాలి. ఇక సిద్దు జొన్నలగడ్డ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మరో సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గానే ఈ చిత్రం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.