Begin typing your search above and press return to search.

టిల్లు గాడి సీటు సిరిగేలా… సాంగ్ తో మోత మొదలైంది!

ఈ సాంగ్ కూడా అతని ఖాతాలో మరో సూపర్ హిట్ పాటగా నిలిచిపోయేలా ఉంది.

By:  Tupaki Desk   |   26 July 2023 1:25 PM GMT
టిల్లు గాడి సీటు సిరిగేలా… సాంగ్ తో మోత మొదలైంది!
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతోంది. ఈ మూవీ లో సిద్దుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మొదటి కథకి కొనసాగింపుగానే ఈ మూవీ ఉండబోతోంది. సిద్దు ఈ మూవీకి కథ అందించడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం చేస్తున్నారు.

మొదటి సినిమా లో డీజే టిల్లు సాంగ్ పాడిన రామ్ మిరియాల ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మొదటి సినిమా లో డీజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే డీజే సాంగ్స్ లో ఈ పాత కచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతకు మించి అనే విధంగా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ప్రేక్షకుల కి బాగా కనెక్ట్ అయ్యింది. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లెరిక్స్ అందించగా రామ్ మిరియాల సంగీతం అందించడంతో పాటు ఆలపించారు. రామ్ మిరియాల సాంగ్స్ కి తెలుగునాట ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సాంగ్ కూడా అతని ఖాతాలో మరో సూపర్ హిట్ పాటగా నిలిచిపోయేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ సాంగ్ దూసుకుపోతోంది.

సంగీతం కూడా రెగ్యులర్ బీట్స్ లా కాకుండా కొత్తగా ఉండటం విశేషం. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టిల్లు పబ్ లో అనుపమ పరమేశ్వరన్ ని ఫ్లట్ చేయడం నుంచి సాంగ్ ని స్టార్ట్ చేసి సినిమా లో వాడి క్యారెక్టరైజేషన్ ని పూర్తిగా వివరిస్తూ డీజే టిల్లులో అతను పడ్డ పాట్లుని పరిచయం చేస్తూ సాంగ్ లెరిక్స్ ఉండటంతో వినడానికి ఆసక్తికరంగా అనిపిస్తోంది.

సాంగ్ అయితే టిల్లు స్క్వేర్ కి గట్టి ప్రమోషన్ అయితే ఇచ్చేలా ఉంది. మరి లాంగ్ రన్ లో ఏ మేరకు రీచ్ అవుతుందనేది చూడాలి. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆగష్టులో రిలీజ్ చేయాల ని అనుకున్న షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో అక్టోబర్ కి వాయిదా పడింది. ఎప్పుడు వచ్చిన టిల్లు స్క్వేర్ సౌండ్ గట్టిగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.